Eric Garcetti: భారత్‌లో అమెరికా రాయబారిగా ప్రెసిడెంట్ జో బైడెన్ సన్నిహితుడు ఎరిక్ గార్సెట్టి నియామకం రెండేళ్ల విరామం తర్వాత ఖరారైంది. ఎరిక్ గార్సెట్టి నామినేషన్‌ను బుధవారం సెనెట్ 52-42 మెజార్టీతో ఆమోదించింది. గార్సెట్టి నామినేషన్ 2021 జులై నుంచి పెండింగ్‌లో ఉండడం గమనార్హం. రెండేళ్లకు పైగా ఆ స్థానం ఖాళీగా ఉంది.
Read Also: Ram Charan: ప్రధాని మోడీతో చరణ్.. ఇది కదా మనకు కావాల్సిన మూమెంట్
గార్సెట్టి లాస్ ఏంజెల్స్ మేయర్‌గా ఉన్నప్పుడు ఒక మాజీ సీనియర్ సలహా దారుపై లైంగిక వేధింపుల వ్యవహారంలో సరైన చర్యలు తీసుకోలేదన్న కారణంతో కొంతమంది చట్టసభ సభ్యులు చేసిన ఆందోళనల మధ్య ఆయన నియామకం పెండింగ్‌లో పడింది. ఇప్పుడు సెనెట్ ఆమోదం తెలపగా.. ఎట్టకేలకు ఆయన నియామకం ఖరారు అయింది. అమెరికాలో ప్రభుత్వం మారిన తర్వాత భారతదేశంలోని చివరి అమెరికా రాయబారి కెన్నెత్ జస్టర్ జనవరి 2021లో పదవీ విరమణ చేశారు. ఈ పదవి అప్పటి నుంచి ఖాళీగా ఉండడం గమనార్హం.