Earthquake: వరస భూకంపాలతో ఉత్తర భారతదేశం వణుకుతోంది. ఒక్క మార్చి నెలలోనే రిక్టర్ స్కేల్ పై 4 తీవ్రతతో 6 భూకంపాలు వచ్చాయి. ఫిబ్రవరి నుంచి లేక్కేస్తే 10 భూకంపాలు వచ్చాయి. తాజాగా ఆఫ్ఘనిస్తాన్ లో సంభవించిన భూకంపం ఢిల్లీతో పాటు ఉత్తరాది రాష్ట్రాలను వణికించింది. తాజా భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్తాన్ లని హిందూకుష్ ప్రాంతంలో నమోదు అయింది. ఆఫ్ఘనిస్తాన్, తుర్క్మెనిస్తాన్, కజకిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, చైనా, కిర్గిస్థాన్, భారత్ లో దీని ప్రకంపనలు కనిపించాయి.
వైజాగ్ వన్డేలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ స్థానంలో స్పిన్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ చోటు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి.
COVID-19: దేశంలో కరోనా కేసుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది. కొన్నాళ్ల వరకు 1000కి లోపే ఉన్న కేసుల సంఖ్య ప్రస్తుతం వెయ్యిని దాటి నమోదు అవుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం దేశంలో 1,134 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 7,026కు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో చత్తీస్ గఢ్, ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, కేరళలో ఒక్కొక్కరు చొప్పున ఐదుగురు మరణించారు.
స్మృతి మంధాన ఇలా కెప్టెన్ అయిందో లేదో ఒత్తిడిలో పడి బ్యాటర్ గా, కెప్టెన్ గా పూర్తిగా విఫలమయ్యింది. కెప్టెన్ గా అనుభవలేమి ఆమెలో కొట్టొచ్చినట్లు కనిపించింది. ఆర్సీబీ కెప్టెన్ గా వరుసగా ఐదు మ్యాచ్ ల్లో ఓటములు చవిచూసిన మంధాన బ్యాటర్ గానూ పూర్తిగా విఫలమైంది.
విశాఖలో జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఘోర పరాజయం పాలైంది. కీలకమైన మూడో వన్డేకు సిద్దమైంది. ఈ మ్యాచ్ జరగననున్న చెన్నైలోని చెపాక్ పిచ్ స్పిన్ కు అనుకూలించే అవకాశాలున్న నేపథ్యంలో మ్యాచ్ ఎలాంటి మలుపులు తిరుగుతుందో మరీ..
తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో అదరగొడుతుంది. టైటిల్ ను నిలబెట్టుకునే దిశగా ఈ తెలంగాణ అమ్మాయి మరో అడుగు ముందుకేసింది.
Earthquake: ఆఫ్ఘనిస్తాన్ లో భారీ భూకంపం సంభవించింది. దీని ధాటికి ఉత్తర భారతదేశం, పాకిస్తాన్ లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ హిందూకుష్ ప్రాంతంలో మంగళవారం సాయంత్రం 6.5 తీవ్రతతో భూకంపం వచ్చింది. దాదాపుగా రెండు నిమిషాల పాటు బలమైన ప్రకంపలను వచ్చాయి.