ప్రధాని మోడీ-అమెరికా అధ్యక్షుడు ట్రంప్ త్వరలోనే కలవబోతున్నారు. అక్టోబర్లో కౌలాలంపూర్లో జరిగే ఆసియాన్ శిఖరాగ్ర సమావేశానికి మోడీ, ట్రంప్ హాజరవుతున్నారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య భేటీ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
నేపాల్ ప్రధాని సుశీలా కర్కితో ప్రధాని మోడీ తొలిసారి సంభాషించారు. ఇటీవల నేపాల్లో సంభవించిన సంక్షోభం కారణంగా కేపీ శర్మ ఓలి ప్రభుత్వం కూలిపోయింది. అనంతరం నేపాల్ సుప్రీంకోర్టు మాజీ చీఫ్ సుశీలా కర్కిని తాత్కాలిక ప్రధానిగా ఎన్నకున్నారు.
ప్రధాని మోడీ బుధవారం 75వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. దేశ, విదేశాల నుంచి ప్రముఖులంతా బర్త్డే విషెస్ చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దగ్గర నుంచి రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము వరకు.. ఇలా నాయకులంతా శుభాకాంక్షలు చెప్పారు.
బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ అక్టోబర్లో భారత్లో పర్యటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అధికారికంగా తేదీలు ప్రకటించనప్పటికీ అక్టోబర్ చివరి నాటికి భారత్లో పర్యటించే ఛాన్సుందని తెలుస్తోంది. ఇక ముంబైలో జరిగే ఫిన్టెక్ సమావేశంలో కూడా కీర్ స్టార్మర్ పాల్గొంటారని సమాచారం.