కర్ణాటక ఉపముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ భారతదేశంలోనే అత్యంత సంపన్న ఎమ్మెల్యే అని ఓ నివేదిక వెల్లడించింది. డీకే శివకుమార్ ఆస్తుల విలువ రూ.1,413 కోట్లు అని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ (న్యూ) నివేదిక పేర్కొంది.
పాకిస్థాన్‌కు చెందిన సీమా హైదర్, తన ప్రేమికుడు సచిన్‌లను ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (యూపీ ఏటీఎస్) వరుసగా మూడో రోజు విచారించింది. సీమాతో సచిన్ ఎలా స్నేహం చేశాడు.. ఆమె నేపాల్ ద్వారా అక్రమంగా భారత్‌కు ఎలా చేరుకుంది అని యూపీ ఏటీఎస్ ప్రెస్ నోట్ ఇచ్చింది.
ట్రినిడాడ్‌లో ప్లేయింగ్ లెవన్ పై కెప్టెన్ రోహిత్ శర్మను అడిగినప్పుడు.. సమాధానం చెప్పలేదు. అంతేకాకుండా చాలా కారణాలను చెప్పాడు. డొమినికా మరియు పోర్ట్ ఆఫ్ స్పెయిన్ మధ్య వ్యత్యాసాన్ని ఎత్తి చూపాడు. డొమినికా పరిస్థితి.. అక్కడి పిచ్ గురించి తనకు బాగా తెలుసునని రోహిత్ అన్నారు. కానీ.. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ విషయంలో అలా కాదన్నాడు. అంతేకాకుండా ట్రినిడాడ్ లో ప్రతికూల వాతావరణమే ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు.
విపక్ష కూటమికి ఇండియాగా పేరు పెట్టినట్లు సోమవారం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. ఈ ఇండియా పేరును తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సూచించినట్టు తెలుస్తోంది. దీనిపై నేతలలంతా లోతుగా చర్చించి, ఏకాభిప్రాయంతో ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇండియా అనే పేరును బిహార్ సీఎం నితీష్ కుమార్ గట్టిగా వ్యతిరేకించినట్లు సమాచారం.
కృష్ణ మండల్ అక్రమంగా భారత్‌లోకి చొరబడ్డారంటూ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. తన దగ్గర ఎలాంటి పాస్‌పోర్ట్ లేదని ఆమె పోలీసులకు చెప్పింది. అందుకే తాను ప్రమాదకమైన దారిలో ప్రయాణించి ఇక్కడకు చేరుకున్నానని చెప్పింది. అయినప్పటికీ సురేంద్రపూర్ పోలీసులు అమెను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశ పెట్టారు. కోర్టు ఆమెకు మూడు నెలల జైలు శిక్ష వేసింది. అయితే, శిక్ష పూర్తయిన తర్వాత అధికారులు ఆమెను తిరిగి బంగ్లాదేశ్‌కు పంపించి వేశారు.
Virat Kohli Eye on Sachin Tendulkar’s All Time Record: ప్రపంచ ఆల్ టైం ఫేవరేట్ క్రికెటర్లలో విరాట్ కోహ్లీ ఒకడు. ప్రస్తుత తరంలో అత్యుత్తమ ప్లేయర్‌గా కొనసాగుతూ ఉన్నాడు. కేన్ విలియమ్సన్, స్టీవ్ స్మిత్, జో రూట్ కూడా కోహ్లీ ఫామ్ ముందు వెనకపడిపోయారు. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌ను ఒక్కడే ఏలుతున్నాడు. ఈ క్రమంలో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టాడు. ఎవరికీ సాధ్యం కానీ మరెన్నో రికార్డ్స్ తన పేరుపై లిఖించుకున్నాడు. ఇక మరో…
ప్రస్తుతం చైనాలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో గల మైన్‌యాంగ్ సిటీ పూర్తిగా నీట మునిగింది. భారీ వర్షాల కారణంగా మైన్‌యాంగ్‌లోని ఒక బ్రిడ్జిపైకి చేరుకున్న నీరు కిందకు ప్రవహిస్తోంది. వరద బాధిత ప్రాంతాల్లోని 40 వేల మంది బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు సంబంధిత అధికారులు వెల్లడించారు.
సృజనాత్మక స్వేచ్ఛ పేరుతో భారతీయ సంస్కృతిని, సమాజాన్ని కించపరిచేలా ప్రభుత్వం అనుమతించదనిసమాచార, ప్రసార మంత్రి అనురాగ్ ఠాకూర్ మంగళవారం ఓటీటీ ప్రతినిధులతో అన్నారు. ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల ప్రతినిధులతో ఇక్కడ జరిగిన సమావేశంలో అనురాగ్ ఠాకూర్ ఈ విషయం చెప్పారు.
బెంగళూరు వేదికగా విపక్షా కూటమి రెండు రోజు సమావేశం ముగిసింది. ఉదయం 11 నుంచి ప్రారంభించి మధ్యాహ్నం 4 గంటల వరకు భేటీ జరిగింది. దాదాపు 26 ప్రతిపక్ష పార్టీలు సమావేశంలో పాల్గొన్నాయి. బీజేపీకి పోటీగా ఏకమైన ప్రతిపక్ష పార్టీల కూటమికి కొత్త పేరును నిర్ణయించారు.
గతేడాది టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ను భారత్ ఓడించిన తీరును ఇంకెవరూ మరిచిపోరు. ఆ విజయం విరాట్ కోహ్లీ కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ గా చెబుతారు. అంతేకాకుండా పాకిస్థాన్‌పై భారత్ సాధించిన అద్భుతమైన విజయాల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే మ్యాచ్. ఆ మ్యాచ్ లో కింగ్ కోహ్లీ ఆడిన ఆటతీరును క్రికెట్ అభిమానులు ఎవరూ మర్చిపోరు. అయితే ఇప్పుడు కోహ్లీ ఆ మ్యాచ్ లో ఆడిన తీరును స్ఫూర్తిగా తీసుకుని ఎమర్జింగ్ ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో తలపడేందుకు భారత్-ఎ ఆటగాళ్లు…