రక్షణ రంగంలో అభివృద్ధి చెందుతున్న భారత దేశం వియత్నాంకు యుద్ధ నౌకను కానుకగా ఇచ్చింది. భారత నౌకాదళానికి 32 ఏళ్లుగా సేవలందించిన ‘ఐఎన్ఎస్ కృపాణ్’ యుద్ధనౌకను వియత్నాంకి ఇండియా బహుమతిగా అందజేసింది.
ప్రస్తుతం భారత్, శ్రీలంక దేశాల మధ్య కేవలం వాయు, నీటి మార్గాలే అందుబాటులో ఉన్నాయి. అయితే ఇరు దేశాల మధ్య రోడ్డు మార్గాన్ని నిర్మించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి శ్రీలంక ప్రభుత్వం, భారత సర్కార్ దగ్గర ప్రతిపాదనలను ఉంచింది. సముద్రంలో వంతెన నిర్మించాలని తాజాగా శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే వెల్లడించారు.
వచ్చే నెలలో దక్షిణాఫ్రికాలో బ్రిక్స్ సదస్సు జరగనుంది. కాగా బ్రిక్స్ సదస్సుకు సంబంధించి రష్యా విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. బ్రిక్స్ దేశాలు వచ్చే నెలలో జరిగే తమ శిఖరాగ్ర సమావేశంలో సీమాంతర వాణిజ్యం కోసం దీర్ఘకాలిక చెల్లింపు వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు పలు ముఖ్యమైన అంశాలపై చర్చిస్తాయని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
ప్రధాని నరేంద్ర మోడీపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తీవ్రంగా విమర్శించారు. హింసాకాండతో అట్టుడుకుతున్న మణిపూర్లో పర్యటించేందుకు ప్రధాని ఎందుకు దూరంగా ఉంటున్నారని ఆయన ప్రశ్నించారు.
PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ శనివారం (జూలై 22) దాదాపు 70,000 మంది యువతకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అపాయింట్మెంట్ లెటర్లను పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా యువకులను ఉద్దేశించి కూడా ప్రధాని ప్రసంగిస్తారని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) శుక్రవారం (జూలై 21) ఒక ప్రకటనలో తెలిపింది.
టమోటాలకు సంబంధించి ఓ న్యూస్ తెగ వైరల్ అవుతుంది. ప్రస్తుతం విదేశాల నుంచి వచ్చే బంధువులను టమాటా తీసుకురమ్మనే పరిస్థితి నెలకొంది. ఇండియాలో ఉంటున్న తల్లి.. దుబాయ్ నుంచి వస్తున్న తన కూతురిని టమోటాలు తీసుకురమ్మని చెప్పింది. ఇ
కేంద్రంలోని బీజేపీ సర్కారుపై మండిపడ్డారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. మణిపూర్ సంక్షోభంపై కేంద్రంపై విమర్శలు గుప్పించిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. బీజేపీ 'బేటీ బచావో' పథకం ఇప్పుడు 'బేటీ జలావో' (మా కుమార్తెలను కాల్చండి)గా మారిందని అన్నారు.
ఇటీవల భారత్లో పర్యటించిన ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా మాట్లాడుతూ.. తయారీ రంగంలో చైనాకు ప్రత్యామ్నాయంగా మారేందుకు భారత్కు అద్భుతమైన అవకాశం ఉందన్నారు.
ఇండియా శ్రీలంక మధ్య ఆర్థిక భాగస్వామ్యం బలపడనుంది. ఇందుకు సంబంధించిన విజన్ డాక్యుమెంట్ను రెండు దేశాలు ఆమోదించాయి. శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే ఇండియా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే