Khalistan: భారత ఎంబసీని మూసేయండి.. కెనడాలో ఖలిస్థాన్ గ్రూప్ హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Khalisthan Group Warning to Bharat: కెనడాలోని ఒట్టావాలో ఉన్న భారత రాయబార కార్యాలయాన్ని వెంటనే మూసి వేయాలని హెచ్చరికలు జారీ చేసింది ఖలిస్థాన్ గ్రూప్. జీ 20 సదస్సుకు వచ్చిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఇంకా ఢిల్లీలో ఉండగానే ఖలిస్థాన్ గ్రూప్ ఇంతటి దుశ్చర్యకు పాల్పడింది. భారతరాయబార కార్యాలయాన్ని వెంటనే మూసివేసి ప్రభుత్వ ప్రతినిధిని వెంటనే వెనక్కు పిలిపించుకోవాలని హెచ్చరించింది. లేదంటే తీవ్రపరిణామాలు తప్పవని వార్నింగ్ ఇచ్చింది. ఇలా గడిచిన 48 గంటల్లోనే కెనడా నుంచి రెండు సార్లు బెదిరింపు కాల్స్ వచ్చినట్లు ప్రభుత్వం వర్గాలు వెల్లడించాయి.
Also Read
ఖలిస్థానీ గ్రూపును అణచివేయాలని భారత్ జీ20 వేదికగా కెనడాకు సూచించింది. ఈ విషయంపై ప్రధాని మోదీ కెనడా ప్రధాని వద్ద అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే, కొంతమంది వ్యక్తులు చేసిన పనులను మొత్తం దేశానికి ఆపాదించకూడదని ట్రూడో పేర్కొనట్లు సమాచారం. అయితే భారత పర్యటనలో ట్రూడో ఇబ్బందిగా ఉండటానికి మోదీ ప్రభుత్వ వైఖరే కారణమని భావించిన ఖలస్థాన్ గ్రూప్ ఇలాంటి బెదిరింపులకు పాల్పడింది. అయితే కెనడా ఈ విషయం గురించి ఎన్నిసార్లు చెప్పినా తన వైఖరి మార్చకోకపోవడంతోనే సమస్యలు వస్తున్నాయని, ఖలిస్థాన్ గ్రూప్ రెచ్చిపోతుందని భారత్ ఆరోపిస్తుంది. భారత రాయబారికి ఏం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కెనడా ప్రభుత్వానిదే అని భారత్ ప్రభుత్వం తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది. ఇక జీ20 సమావేశాలకు వచ్చిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అతని పాత విమానంలో ఇబ్బంది కలగడంతో సిబ్బందితో పాటు ఢిల్లీలోనే ఉండిపోయిన సంగతి. ఇప్పటికీ విమానం కోసం ఆయన వేచి చూస్తున్నారు. ఇంకా కెనడా ప్రధాని వారి దేశం చేరుకోకముందే ఖలిస్థాన్ గ్రూప్ ఇలా చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక దీనిపై ట్రూడో ఎలా స్పందిస్తారు. ఖలిస్థాన్ గ్రూప్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.
- Tags
- Canada
- india
- Khalisthan Group
తాజావార్తలు
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
-
OTR: కొండా దంపతుల విషయమై సొంత కేడర్ లో గందరగోళం
-
Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
-
OTR: పసుపు నీళ్లు చుట్టూ తిరుగుతున్న తెలంగాణ పాలిటిక్స్
-
UP: యూపీ ఎన్నికల వేళ కాల్పులు.. ప్రయాగ్రాజ్లో ఎస్పీ నేత హత్య
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?