Shreyas Iyer: విరాట్ కోహ్లీ నుంచి నెంబర్ 3 స్పాట్‌ను ఎవరూ తీసుకోలేరు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shreyas Iyer Says Virat Kohli is one of the greatest in Cricket: వెన్ను గాయంతో ఆరు నెలల పాటు క్రికెట్‌కు దూరమైన స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్.. ఇటీవల కోలుకుని ఆసియా కప్ 2023తో పునరాగమనం చేశాడు. అయితే ఆసియా కప్‌లో రెండు మ్యాచ్‌లు ఆడేసరికే అయ్యర్‌కు మళ్లీ ఫిట్‌నెస్ సమస్యలు తలెత్తాయి. వెన్ను నొప్పి కారణంగా అతడు సూపర్-4 మ్యాచ్‌లకు దూరం అయ్యాడు. దాంతో అయ్యర్ ఫిట్‌నెస్‌పై సందేహాలు నెలకొన్నాయి. ప్రపంచకప్ 2023 జట్టులో ఉంటాడా? అనే అనుమానం కలిగింది. ఆ అనుమానాలకు ఒక్క ఇన్నింగ్స్‌తో చెక్ పెట్టాడు.
ఇండోర్ వేదికగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో శ్రేయస్ అయ్యర్ సెంచరీ (105; 90 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లు) బాదాడు. దీంతో ప్రపంచకప్ జట్టులో అయ్యర్ స్థానం సుస్థిరమైనట్లేనని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో అయ్యర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. క్రీడల్లో ఎత్తుపల్లాలతో కూడిన ప్రయాణం తప్పదని, భారత జట్టులో ఆడుతానని తనపై తనకు పూర్తి నమ్మకం ఉండేదని చెప్పాడు. రెండో వన్డేలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన అయ్యర్ మీడియాతో మాట్లాడాడు.
Also Read
- Bhatti Vikramarka: "మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా".. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
- iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
- Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
- Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
Also Read: Gold Medal: ఆసియా క్రీడల్లో భారత్‌కు బంగారు పతకం!
‘ఆటలో ఎత్తుపల్లాలతో కూడిన ప్రయాణం తప్పదు. సెంచరీ సాధించడం చాలా సంతోషంగా ఉంది. క్లిష్ట సమయాల్లో నాకు అండగా నిలిచిన సహచరులు, స్నేహితులు, కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు. టీవీల్లో భారత్ మ్యాచ్‌లు చూసినప్పుడు నేను కూడా ఆడితే బాగుంటుందని అనిపించేది. ఇప్పుడు టీమిండియా తరఫున ఆడుతున్నా. గాయాలు చాలా ఇబ్బంది పెట్టాయి. నాపై నాకు పూర్తి నమ్మకం ఉండడం వల్లే మళ్లీ జట్టులో ఆడుతున్నా. నా లక్ష్యాలేంటో నాకు తెలుసు. వాటి కోసం ఎప్పుడూ కష్టపడుతున్నా. ఆస్ట్రేలియాపై నా ప్రణాళికలను పక్కాగా అమలు చేశా. జట్టు కోసం ఏ స్థానంలోనైనా ఆడేందుకు సిద్ధం. అయితే నెంబర్ 3 స్పాట్ విరాట్ కోహ్లీదే. అతడి నుంచి దాన్ని ఎవరూ తీసుకోలేరు. విరాట్ అత్యుత్తమ క్రికెటర్’ అని శ్రేయస్ అయ్యర్ తెలిపాడు.
Shreyas Iyer said, “Virat Kohli is one of the greatest that has sealed the No.3 spot. There’s no chance I’m gonna steal that position from him”. pic.twitter.com/1uGnKCBUcr
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 24, 2023
తాజావార్తలు
-
Sivakarthikeyan: ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!
-
Sidharth – Kiara: రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్ కపుల్!
-
Hanuman Ansh Telugu: ‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్.. త్రివిక్రమ్ వెనకంజ వేయడనికి కారణం ఏంటి?
-
Bhatti Vikramarka: “మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా”.. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
-
Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని ‘రణబాలి’తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!