# నేడు తిరుపతిలో సీఎం జగన్ పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3.50 నిమిషాలకు 684 కొట్లతో నిర్మించిన శ్రీనివాస సేతు ప్లై ఓవర్ ప్రారంభిస్తారు. వర్చువల్‌గా ఎస్వీ ఆర్ట్స్ కాలేజీ హాస్టల్ భవనం ప్రారంభం సహా టీటీడీ ఉద్యోగులకు ఇళ్ళ స్దల పట్టాల పంపిణీ చేయానున్నారు. సాయంత్రం 4.30 గంటలకు తాతయ్య గుంట గంగమ్మ ఆలయ దర్శన అనంతరం సీఎం తిరుమల పయనం కానున్నారు. # నేటి నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. 5 రోజుల పాటు…
ఆసియా కప్ 2023 ఫైనల్లో భారత్ చారిత్రాత్మక విజయం సాధించినందుకు పలువురు క్రికెట్ దిగ్గజాలు అభినందనల వర్షం కురిపిస్తున్నారు. సచిన్ టెండూల్కర్ నుంచి యువరాజ్ సింగ్ వరకు పలువురు క్రికెటర్లు అభినందనలు తెలిపారు.
2023 ఆసియా కప్ ఫైనల్లో టీమిండియా శ్రీలంకను సులువుగా ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. దీంతో భారత్ 8వ సారి ఆసియా కప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక జట్టు కేవలం 50 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం భారత జట్టు కేవలం 6.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని సులభంగా ఛేదించింది.
ఆసియా కప్ 2023లో శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ బంతితో విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో సిరాజ్ తన రెండో ఓవర్లో 4 వికెట్లు పడగొట్టడంతో వన్డే క్రికెట్లో 50 వికెట్లు కూడా పూర్తి చేసుకున్నాడు.
ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక బ్యాట్స్ మెన్స్ కు టీమిండియా బౌలర్లు చుక్కలు చూపించారు. టాస్ ఓడిన భారత్.. బౌలింగ్ కు దిగింది. అయితే జస్ప్రీత్ బుమ్రా వేసిన తొలి ఓవర్లనే శ్రీలంక మొదటి వికెట్ తీశాడు. ఆ తర్వాత హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్ సంచలన స్పెల్ తో శ్రీలంక టాపార్డర్ ను కుప్పకూల్చాడు.
Anantnag Encounter: జమ్మూ కాశ్మీర్ అనంత్‌నాగ్ ఎన్కౌంటర్ 5వ రోజుకు చేరుకుంది. బుధవారం ప్రారంభమైన ఈ ఎన్కౌంటర్ లో ఇప్పటికే నలుగురు ఆర్మీ అధికారులు వీరమరణం పొందారు. ఎలాగైన ఉగ్రవాదులను మట్టుపెట్టాలనే వ్యూహాలతో భద్రతాసిబ్బంది ఉంది. అయితే దట్టమైన అడువులు, కొండలు, లోయలు ఉగ్రవాదులకు స్వర్గధామంగా ఉన్నాయి. జింగిల్ వార్ఫేర్ లో శిక్షణ పొందిన ఉగ్రవాదులు సైన్యానికి సవాల్ విసురుతున్నారు.
సనాతన్ ధర్మంపై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయి. దీనికి సంబంధించి 'భారత్' కూటమిని బీజేపీ టార్గెట్ చేస్తోంది. తాజాగా.. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఓ ప్రకటన చేశారు. డీఎంకే మంత్రి చేసిన ప్రకటన చాలా దురదృష్టకరమని అభివర్ణిస్తూ.. సనాతన ధర్మం శాశ్వతమైనదని.. ప్రపంచంలోని ఏ శక్తీ దానిని నాశనం చేయదని అన్నారు.
రేపు శ్రీలంక రాజధాని కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరిగే టైటిల్ మ్యాచ్‌లో టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్ శ్రీలంకతో తలపడనుంది. శ్రీలంక కంటే భారత్ జట్టు చాలా బలంగా ఉన్న.. లంకేయుల జట్టులో ఓ ఆటగాడు టీమిండియాను టెన్షన్‌కి గురిచేస్తున్నాడు. ఇంతకుముందు జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో ఈ రెండు జట్లు తలపడినప్పుడు.. ఈ ఆటగాడు భారత జట్టులో సగం మందిని పెవిలియన్‌కు పంపించాడు.
దేశ వ్యాప్తంగా సనతాన ధర్మంపై తీవ్ర దుమారం చెలరేగుతున్న విషయం తెలిసిందే. విపక్షాల కూటమి (INDIA)ని టార్గెట్ గా చేసుకుని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అయితే తాజాగా.. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ కాంగ్రెస్, విపక్షాల కూటమిపై మండిపడ్డారు.