India-Canada: ఇండియా, కెనడాల మధ్య రాజకీయ విభేదాలు తారాస్థాయికి చేరినట్లు కనిపిస్తోంది. ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు వాయిదా పడ్డాయి. అక్టోబర్‌లో ఇరు దేశాల మధ్య జరగాల్సిన ట్రెడ్ మిషన్ వాయిదా వేస్తున్నట్లు కెనడా వాణిజ్య మంత్రి మేరీ ఎన్జి ప్రతినిధి శాంతి కోసెంటినో ధృవీకరించారు. కారణం లేకుండా ఈ చర్చల్ని వాయిదా వేశారు.
నామమాత్రమైన మ్యాచ్‌లో టీమ్ఇండియా ఓడిపోయింది. కొలంబో వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్ లో భారత్ 6 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. breaking news, latest news, telugu news, big news, bangladesh, india, asiacup 2023
కాంగ్రెస్ నూతన వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) తొలి సమావేశం శనివారం హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణాలో నిర్వహించనున్నారు. రాబోయే లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్ వ్యూహం, విపక్షాల కూటమి (INDIA), రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు, ఇతర అంశాలపై చర్చించనున్నారు. అంతేకాకుండా.. 'భారత్ జోడో యాత్ర' రెండో దశపై కూడా ఈ వర్కింగ్ కమిటీలో చర్చించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
చైనా స్మార్టఫోన్ తయారీదారులపై కొనసాగుతున్న ఒత్తిడి నేపథ్యంలో చైనా కంపెనీ షావోమి సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో, చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ షావోమి సప్లయిర్ డిక్సన్ టెక్నాలజీస్ ఇండియా లిమిటెడ్ న్యూఢిల్లీ శివార్లలో భారీ ఫ్యాక్టరీని నిర్మించేందుకు రెడీ అవుతుంది.
ఆసియా కప్ 2023లో సూపర్-4 దశ చివరి మ్యాచ్ లో భాగంగా.. కాసేపట్లో భారత్ - బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది.
Pakistan: దాయది దేశం పాకిస్తాన్, భారతదేశంపై ద్వేషాన్ని పెంచుకుంటూనే ఉంటుంది. ఇటీవల కాలంలో భారత్ ఎదుగుదలను చూసి తట్టుకోలేకపోతోంది. ముఖ్యంగా గ్లోబల్ పవర్ గా భారత్ ఎదుగుతుంటే.. డాలర్లను అడుక్కునే స్థాయికి పాకిస్తాన్ దిగజారింది. దీంతో భారత సరిహద్దుల్లో నిత్యం అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది.
Compare iPhone 15 Price in US and Dubai vs India: ‘యాపిల్’ లవర్స్ ఎంతగానో ఎదురుచూసిన ఐఫోన్ 15 సిరీస్ ప్రపంచవ్యాప్తంగా విడుదలయిన విషయం తెలిసిందే. 15 సిరీస్‌లో భాగంగా ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌లను యాపిల్ రిలీజ్ చేసింది. 15 సిరీస్ ప్రీ బుకింగ్స్ నేడు ఆరంభం కానుండగా.. విక్రయాలు త్వరలో ప్రారంభం కానున్నాయి. అయితే ప్రస్తుతం ఐఫోన్ 15 సిరీస్…
Mayank Agarwal beats Virat Kohli and Shubman Gill’s Yo-Yo Test Score: భారత జాతీయ జట్టులో చోటు దక్కాలంటే ఏ ఆటగాడైనా బీసీసీఐ నిర్వహించే ‘యో-యో’ టెస్ట్ పాస్ అవ్వాల్సిందే. ప్రస్తుత యో-యో టెస్ట్ ఉత్తీర్ణత స్కోరు 16.5. ప్రతి సిరీస్ ముందు భారత ఆటగాళ్లకు బీసీసీఐ యో-యో టెస్ట్ నిర్వహిస్తుంటుంది. ఆసియా కప్ 2023 కోసం శ్రీలంక వెళ్లే ముందు ప్లేయర్లు అందరికీ ఈ ఫిట్నెస్ టెస్టు నిర్వహించారు. ఇందుకు సంబందించిన స్కోరును…
ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్‌లో జరిగిన విజయ శంఖనాద్ సభలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్షాలంతా కలిసి కూటమిని ఏర్పాటు చేసుకున్నారని ప్రధాని అన్నారు. ఇప్పుడు వీరంతా భారతదేశం యొక్క శాశ్వతమైన సంస్కృతిని నాశనం చేస్తున్నారని.. తమ అధికార దురాశతో దానిని విచ్ఛిన్నం చేయాలని నిర్ణయించుకున్నారని మోడీ తెలిపారు.