అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ కంపెనీ యాపిల్ ఉత్పత్తులకు ముఖ్యంగా ఐఫోన్ కు ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ పెరుగుతోంది. ప్రపంచంలోని చాలా దేశాల్లో ఈ కంపెనీకి చెందిన ఫోన్లు ఎక్కువగా ఉపయోగించబడుతున్నాయి.
Vladimir Putin: బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నిన్న (గురువారం) రష్యాలోని సెయింట్ పీటర్స్ వర్గ్లో వ్లాదిమీర్ పుతిన్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పుతిన్తో దోవల్ షేక్ హ్యాండ్ ఇచ్చారు.
అమెరికా నుంచి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఆహ్వానం వచ్చింది. తమ దేశ పర్యటనకు రావాల్సిందిగా ప్రెసిడెంట్ బైడెన్ మోడీకి ఆహ్వానం పంపించారు. దీనికి మోడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే, భారత ప్రధాని అమెరికా పర్యటనపై నేడు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన, షెడ్యూల్ రిలీజ్ చేసే అవకాశం ఉంది.
BJP: ప్రధాని నరేంద్రమోడీ, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఇంటికి వెళ్లడం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. గణపతి పూజ సందర్భంగా మోడీ, చంద్రచూడ్ ఇంటికి వెళ్లారు. గణపతి పూజలో సీజేఐ దంపతులతో కలిసి ఉన్న ఫోటోని ఆయన ఎక్స్ వేదికగా షేర్ చేశారు. దీంతో ఒక్కసారిగా వివాదం చెలరేగింది. కాంగ్రెస్, శివసేన (ఉద్ధవ్), ఆర్జేడీ వంటి ఇండియా కూటమి నేతలు ప్రధాని వెళ్లడాన్ని తప్పుపడుతున్నాయి.
BJP VS INDIA: ప్రధాని నరేంద్రమోడీ, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ఇంటికి వెళ్లడం వివాదాస్పదమైంది. గణేష్ పూజ కోసం వెళ్లడం ఇప్పుడు రాజకీయ రచ్చకు కారణమైంది. విపక్ష నేతలు దీనిని తప్పుపడుతున్నారు. ఇది ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను తీసుకెళ్లుతుందని చెబుతున్నారు. అయితే, గణపతి పూజకు వెళ్లడం నేరం కాదని, న్యాయమూర్తులు, రాజకీయ నాయకులు పలు సందర్భాల్లో అనేక వేదికలను కలిసి పంచుకున్నారని అధికార బీజేపీ ఎదురుదాడి చేసింది.