యమహా మోటార్ భారత మార్కెట్లోకి కొత్త R15M బైక్ను విడుదల చేసింది. ఈ బైక్లో కొత్త కార్బన్ ఫైబర్ ట్రిమ్ వేరియంట్ అందుబాటులో ఉంది. అంతేకాకుండా.. కొత్త ఫీచర్లు చేర్చారు. మెటాలిక్ గ్రేలో R15M ధర రూ.1,98,300 లభిస్తుంది. కొత్త కార్బన్ ఫైబర్ ప్యాటర్న్ రూ.2,08,300కి అందుబాటులో ఉంది. రెండు ధరలు ఎక్స్-షోరూమ్. R15M బైక్ బాడీవర్క్ కార్బన్ ఫైబర్ నమూనాతో తయారు చేశారు.
ఛాంపియన్స్ ట్రోఫీ తొమ్మిదో ఎడిషన్ పాకిస్థాన్లో జరగనుంది. ఈ టోర్నీ కోసం భారత జట్టు పాకిస్థాన్లో పర్యటిస్తుందా లేదా? అనేది ప్రశ్నగానే మిగిలి ఉంది. ఈ నిర్ణయంపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ క్రమంలో.. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ మొయిన్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా పాకిస్థాన్లో పర్యటించకపోతే, భవిష్యత్తులో పాక్ జట్టు కూడా ఏ టోర్నీ కోసం ఇండియాకు వెళ్లదని అని అన్నాడు.
ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్ చివరి లీగ్ మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై భారత్ విక్టరీ సాధించింది. పాకిస్తాన్ను చిత్తుగా ఓడించింది. ఇప్పటికే వరుస విజయాలతో సెమీస్కు చేరిన భారత్.. నామమాత్రపు మ్యాచ్లో పాకిస్తాన్ ను ఓడించింది. 2-1 ఆధిక్యంతో గెలుపొందింది.
India: డ్రాగన్ కంట్రీ చైనాను సమర్థంగా ఎదుర్కోవడానికి ప్రత్యేకంగా రూపొందిన తేలికపాటి యుద్ధ ట్యాంకు జొరావర్పై భారత్ నిన్న (శుక్రవారం) ప్రాథమిక పరీక్షలు చేసింది. ఈ సందర్భంగా ఇది అద్భుత ప్రదర్శనను చాటిందని రక్షణ మంత్రిత్వశాఖ చెప్పుకొచ్చింది.