OSD Posts: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్‌లో విజేతగా నిలిచిన భారత జట్టులోని ముగ్గురు క్రికెటర్లకు ఇండియన్ రైల్వేస్ గిఫ్ట్ ప్రకటించింది. ఇంతకీ ఆ ముగ్గురు మహిళా క్రికెటర్లు ఎవరో తెలుసా.. ప్రతికా రావల్, స్నేహ్ రాణా, రేణుకా సింగ్ ఠాకూర్‌లు. తాజాగా ఈ ముగ్గురు క్రికెటర్లను భారత రైల్వేస్ ఆఫీసర్స్ ఆన్ స్పెషల్ డ్యూటీ (OSD – స్పోర్ట్స్)గా నియమించింది. ఈ ముగ్గురు ఇప్పుడు గ్రూప్ బి గెజిటెడ్ ఆఫీసర్‌కు సమానమైన జీతాలు, ప్రయోజనాలను…
DSP Richa Ghosh: భారతీయ మహిళా క్రికెట్ జట్టులోకి మరో డిస్పీ వచ్చారు. భారత మహిళా క్రికెట్ జట్టుకు స్టార్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ అయిన రిచా ఘోష్, పశ్చిమ బెంగాల్ పోలీసులో డిఎస్పీ (డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్)గా నియమితులయ్యారు. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (CAB) సన్మాన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆమెకు నియామక లేఖను స్వయంగా అందజేశారు. భారత మహిళా జట్టు ఇటీవలి ప్రపంచ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన రిచా…
Tata Sierra: భారత మహిళల క్రికెట్ జట్టు సాధించిన చారిత్రక విజయాన్ని పురస్కరించుకుని, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ ఓ మంచి కార్యాన్ని తలపెట్టింది. ప్రపంచ కప్ గెలిచిన జట్టులోని ప్రతి సభ్యురాలికి త్వరలో విడుదల కానున్న సరికొత్త టాటా సియెరా (Tata Sierra) ఎస్‌యూవీని బహుమతిగా ఇవ్వనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇది కేవలం బహుమతి మాత్రమే కాదు.. వారి అద్భుతమైన ధైర్యసాహసాలు, అంకితభావం, దేశానికి గర్వకారణం తెచ్చిన స్ఫూర్తికి నిజమైన గౌరవమని టాటా మోటార్స్ పేర్కొంది.…
Shree Charani: ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాకు క్రీడా రంగంలో పెద్దగా పేరు లేని ప్రాంతమైనా.. ఈ జిల్లాలోని వీరపునాయిని మండలం, ఎర్రమల్లె గ్రామానికి చెందిన యువ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ నల్లపురెడ్డి శ్రీ చరణి భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించింది. మారుమూల పల్లెటూరు నుంచి వచ్చి ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచ కప్ 2025లో భారత్ విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించి దేశానికే గర్వకారణంగా మారింది. ఆంధ్రప్రదేశ్ నుంచి మహిళల…
INDW vs SAW: మహిళల వన్డే ప్రపంచ కప్ తుది ఘట్టానికి చేరుకుంది. ఈరోజు (నవంబర్ 2న) ఢిల్లీలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగే ఫైనల్లో దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది.
ICC Womens World Cup 2025: 2025 మహిళల వన్డే వరల్డ్ కప్‌కు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 2 వరకు భారత్, శ్రీలంకలో జరగనుంది. భారత్ తమ ప్రపంచ కప్ ప్రయాణాన్ని సెప్టెంబర్ 30న బెంగళూరులో శ్రీలంకతో మొదలుపెట్టనుంది. ఈ ప్రపంచ కప్‌లో భారత మహిళల జట్టు పాకిస్థాన్‌తో అక్టోబర్ 5న తలపడనుంది. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ శ్రీలంక…