OSD Posts: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్‌లో విజేతగా నిలిచిన భారత జట్టులోని ముగ్గురు క్రికెటర్లకు ఇండియన్ రైల్వేస్ గిఫ్ట్ ప్రకటించింది. ఇంతకీ ఆ ముగ్గురు మహిళా క్రికెటర్లు ఎవరో తెలుసా.. ప్రతికా రావల్, స్నేహ్ రాణా, రేణుకా సింగ్ ఠాకూర్‌లు. తాజాగా ఈ ముగ్గురు క్రికెటర్లను భారత రైల్వేస్ ఆఫీసర్స్ ఆన్ స్పెషల్ డ్యూటీ (OSD – స్పోర్ట్స్)గా నియమించింది. ఈ ముగ్గురు ఇప్పుడు గ్రూప్ బి గెజిటెడ్ ఆఫీసర్‌కు సమానమైన జీతాలు, ప్రయోజనాలను పొందుతారు. రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డ్ (RSPB) తీసుకున్న ఈ చొరవ మహిళా క్రికెటర్లకు ఆర్థిక భద్రతను అందించడమే కాకుండా వారికి పరిపాలనా బాధ్యతలను కూడా అప్పగిస్తుంది.
READ ALSO: TTD: వైకుంఠ ద్వార దర్శనాలకు ఫుల్ డిమాండ్.. రికార్డుస్థాయిలో ఈ డిప్ రిజిస్ట్రేషన్లు..
ఈ ఏడాది మహిళల క్రికెట్ ప్రపంచ కప్‌ను భారతదేశం, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 30, 2025న ప్రారంభమైన ఈ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ నవంబర్ 2న జరిగింది. హర్మన్‌ప్రీత్ కెప్టెన్సీలో భారత మహిళా జట్టు ఫైనల్స్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి మొదటిసారిగా మహిళా క్రికెట్ జట్టు ప్రపంచ ఛాంపియన్‌గా భారత మహిళా జట్టు నిలిచి చరిత్ర సృష్టించింది. రైల్వేస్ తాజాగా ఓఎస్‌డీలుగా నియమించిన ఈ ముగ్గురు భారత క్రీడాకారిణులు ప్రపంచ కప్‌లో అద్భుతమైన ప్రదర్శనలు చేశారు. అయితే సెమీ-ఫైనల్స్‌కు ముందు ప్రతీకా రావల్ గాయం కారణంగా టోర్నమెంట్ నుంచి నిష్క్రమించారు. ఆమె స్థానంలో షెఫాలీ వర్మ ఎంపికైన విషయం తెలిసిందే. అయితే గ్రూప్ దశ మ్యాచ్‌లలో ప్రతీకా అనేక చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడింది.
ఈ ప్రపంచ కప్‌లో స్నేహ్ రాణా అద్భుతమైన ప్రదర్శన చేశారు. అయితే అక్టోబర్ 23న న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్ తర్వాత, ఆమెకు మరిన్ని అవకాశాలు రాలేదు. కానీ రేణుకా సింగ్ ప్రపంచ కప్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసింది. ఫైనల్లో కూడా ఆమె ఎనిమిది ఓవర్లలో కేవలం 28 పరుగులు మాత్రమే ఇచ్చి గొప్ప ప్రదర్శన చేసి భారత విజయంలో కీలకంగా మారింది.
READ ALSO: Ajay Devgn: హైదరాబాద్‌లో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్గన్ ఫిల్మ్ సిటీ