ICC Womens World Cup 2025: 2025 మహిళల వన్డే వరల్డ్ కప్‌కు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 2 వరకు భారత్, శ్రీలంకలో జరగనుంది. భారత్ తమ ప్రపంచ కప్ ప్రయాణాన్ని సెప్టెంబర్ 30న బెంగళూరులో శ్రీలంకతో మొదలుపెట్టనుంది. ఈ ప్రపంచ కప్‌లో భారత మహిళల జట్టు పాకిస్థాన్‌తో అక్టోబర్ 5న తలపడనుంది. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ శ్రీలంక రాజధాని కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరగనుంది. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపై భారత్ వైమానిక దాడుల నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య ఇది తొలి క్రికెట్ మ్యాచ్ కావడంతో ఈ పోరు కీలకంగా మారింది.
Read Also: Piyush Goyal: హెలికాప్టర్లో సాంకేతిక సమస్య.. కేంద్రమంత్రి పర్యటన రద్దు..
ఇక పాకిస్థాన్ జట్టుకు న్యూట్రల్ వేదికగా కొలంబోను ఐసీసీ కేటాయించింది. అక్కడ మొత్తం 11 లీగ్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇందులో శ్రీలంక జట్టు నాలుగు హోం మ్యాచ్‌లు ఆడనుంది. కొలంబోలో జరగాల్సిన మ్యాచ్ లలో సెమీ ఫైనల్ (అక్టోబర్ 29), ఫైనల్ (నవంబర్ 2) కూడా ఉన్నాయి. అయితే పాకిస్థాన్ నాకౌట్‌కు అర్హత సాధించినట్లయితే మాత్రమే అక్కడ జరుగుతాయి. లేకపోతే భారత్ లోనే మ్యాచ్లు జరుగనున్నాయి. భారత్ తమ లీగ్ మ్యాచ్‌లను ఈ వేదికలపై ఆడనుంది.
Read Also: Kannappa Vs Kubera : కన్నప్ప వర్సెస్ కుబేర.. ఏ ట్రైలర్ బాగుందంటే..?
సెప్టెంబర్ 30: భారత్ vs శ్రీలంక – బెంగళూరు
అక్టోబర్ 5: భారత్ vs పాకిస్థాన్ – కొలంబో
అక్టోబర్ 9: భారత్ vs దక్షిణాఫ్రికా – విశాఖపట్నం
అక్టోబర్ 12: భారత్ vs ఆస్ట్రేలియా – విశాఖపట్నం
అక్టోబర్ 19: భారత్ vs ఇంగ్లాండ్ – ఇండోర్
అక్టోబర్ 23: భారత్ vs న్యూజిలాండ్ – గౌహతి
అక్టోబర్ 26: భారత్ vs బంగ్లాదేశ్ – బెంగళూరు
ఈ టోర్నమెంట్ రౌండ్-రాబిన్ దశ ముగిశాక టాప్-4 జట్లు సెమీ ఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. సెమీ ఫైనల్స్ లో మొదటి స్థానంలో ఉన్న జట్టు నాల్గవ స్థానంలోని జట్టుతో, రెండో స్థానంలో ఉన్న జట్టు మూడో స్థానంలో ఉన్న జట్టుతో తలపడుతుంది. సెమీ ఫైనల్స్ తర్వాత నవంబర్ 2న గ్రాండ్ ఫినాలే జరుగుతుంది.