Team India Photoshoot: రాంచీలో నవంబర్ 30న టీమిండియా – దక్షిణాఫ్రికా మధ్య వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా ఒక ఫోటోషూట్‌లో పాల్గొంది. ఈ వీడియోను BCCI సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోతో క్రికెట్ ప్రేమికులు మస్తు ఖుషీ అవుతున్నారు. వీడియోలో రిషబ్ పంత్, అర్ష్‌దీప్ సింగ్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, మొదలైన ఆటగాళ్లు పాల్గొన్నారు. ఈ వీడియోలో రిషబ్ పంత్‌తో ఫోటోగ్రాఫర్ మామూలు కామెడీ చేయలేదు. ఫోటో…
Virat Kohli MS Dhoni in Ranchi: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి అభిమానుల్లో ఉత్సాహాన్ని రేపాడు. దక్షిణాఫ్రికాతో మొదటి వన్డేకు సిద్ధమవుతున్న సమయంలో గురువారం సాయంత్రం కోహ్లీ రాంచీలోని మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నివాసానికి చేరుకోవడం క్రికెట్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. కోహ్లీ కారు ధోనీ ఇంటి గేటు దాటుతుండగా బయట భారీగా చేరుకున్న అభిమానులు ఒక్కసారిగా హోరెత్తిపోయారు. మొబైల్ ఫోన్లలో ఫోటోలు, వీడియోలు తీసేందుకు తహతహలాడారు.
Shreyas Iyer Health Update: ఆస్ట్రేలియా పర్యటనలో భారత క్రికెట్ జట్టు స్టార్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన మూడో వన్డే సందర్భంగా.. ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ కారీ క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో అయ్యర్ కింద పడిపోయాడు. ఈ సంఘటనలో శ్రేయస్ ప్లీహానికి గాయమైంది. అనంతరం ఆయనను సిడ్నీలోని ఒక ఆసుపత్రిలో చేర్చారు. వైద్య పరీక్షలో అయ్యర్‌కు స్వల్ప అంతర్గత రక్తస్రావం జరిగినట్లు వైద్యులు…