Team India Photoshoot: వన్డే సిరీస్‌కు ముందు టీమిండియా సరదా ఫోటో షూట్! వీడియో చూశారా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Team India Photoshoot: రాంచీలో నవంబర్ 30న టీమిండియా – దక్షిణాఫ్రికా మధ్య వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా ఒక ఫోటోషూట్‌లో పాల్గొంది. ఈ వీడియోను BCCI సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోతో క్రికెట్ ప్రేమికులు మస్తు ఖుషీ అవుతున్నారు. వీడియోలో రిషబ్ పంత్, అర్ష్‌దీప్ సింగ్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, మొదలైన ఆటగాళ్లు పాల్గొన్నారు. ఈ వీడియోలో రిషబ్ పంత్‌తో ఫోటోగ్రాఫర్ మామూలు కామెడీ చేయలేదు. ఫోటో తీసే టైంలో పంత్ సరిగ్గా నవ్వలేకపోవడంతో, ఫోటోగ్రాఫర్ పంత్‌ను కొంచెం నవ్వమని అడిగాడు, దానికి ఈ స్టార్ ప్లేయర్ సూపర్ సమాధానం ఇచ్చాడు.
READ ALSO: Pakistan: పాకిస్తాన్‌కు ఫిన్లాండ్ షాక్.. రాయబార కార్యాలయం మూసివేత..
Also Read
ఇతర టీమిండియా ఆటగాళ్ల మాదిరిగానే పంత్ కూడా ఫోటోషూట్ కోసం వచ్చాడు. అయితే ఫోటోగ్రాఫర్ పంత్‌వి కొన్ని ఫోటోలు తీశాడు, తర్వాత ఆయన పంత్‌ను కొంచెం నవ్వమని అడిగాడు. దీంతో పంత్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు నిద్రపోయానని, ఇంతకు ముందే మేల్కొన్నానని బదులిచ్చాడు. ఫోటో తీస్తుండగా పంత్ కళ్లలో నిద్ర కనిపించిందని పలువురు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోలో విరాట్ కోహ్లీ తన ఫోటోను ప్రొఫెషనల్ పద్ధతిలో తీయించుకోగా, రోహిత్ శర్మ ఫోటోగ్రాఫర్‌కు ముందుగా ఏ యాంగిల్ తీయాలో సూచించాడు.
ఇదంతా పక్కన పెడితే టీమిండియాకు వన్డే సిరీస్ గెలవడం చాలా కీలకం. దక్షిణాఫ్రికా చేతిలో ఇప్పటికే టెస్ట్ సిరీస్‌ను భారత జట్టు కోల్పోయింది. 0-2 తేడాతో క్లీన్ స్వీప్ తర్వాత, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ విమర్శలను ఎదుర్కొంటున్నాడు, ఇదే సమయంలో ఆయనను పదవి నుంచి తొలగించాలనే చర్చ కూడా జరుగుతోంది. ఇప్పుడు టీమిండియా వన్డే ఫార్మాట్‌లో బాగా రాణించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈ ఫార్మాట్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన చివరి సిరీస్‌ను భారత్ కోల్పోయింది. దక్షిణాఫ్రికాపై కూడా అదే జరిగితే, కోచ్ నుంచి మొత్తం టీం వరకు అందరిపై నిస్సందేహంగా ఒత్తిడి పెరుగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.
READ ALSO: Ditva Cyclone: తమిళనాడుకు దిత్వా తుఫాన్ ఏఫెక్ట్..
Lights 💡
Camera 📸
Action 🎬A fun BTS sneak peek as #TeamIndia gets ready for the #INDvSA ODI series opener in Ranchi 🥳@IDFCFIRSTBank pic.twitter.com/JK2IdsxnJ8
— BCCI (@BCCI) November 29, 2025
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!