Ind vs Pak: ఆసియా కప్ 2025లో భారత జట్టు వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచి అజేయంగా నిలిచింది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు ఇప్పుడు తన మొదటి సూపర్ 4 దశ మ్యాచ్‌ను చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్ సెప్టెంబర్ 21వ తేదీ ఆదివారం దుబాయ్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. తాజాగా ఈ మ్యాచ్ గురించి ఒక ముఖ్యమైన సమాచారం వెలువడింది. జింబాబ్వేకు చెందిన…
India vs Pakistan: ఏప్రిల్ 22 పహల్గామ్ దాడి అనంతరం భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. దీంతో భారత్ పాకిస్థాన్‌తో క్రమంగా అన్ని సంబంధాలను తెంచుకుంది. కానీ.. తాజాగా ఇరు దేశాల మధ్య జరుగుతున్న క్రికెట్ మ్యాచ్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ మ్యాచ్‌ను రద్దు చేయాలంటూ.. ఆదివారం శివసేన (UBT) మహారాష్ట్ర అంతటా వీధి నిరసనలు నిర్వహించింది. ఇది దేశ ప్రజల మనోభావాలను అవమానించడమని ఆ పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఈ నిరసనల్లో భాగంగా…
2025 ఆసియా కప్ మెగా మ్యాచ్ ఆదివారం దుబాయ్‌లో జరగనుంది. ఈ మ్యాచ్ పట్ల అభిమానుల ఉత్సాహం ఆకాశాన్ని తాకింది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు తమ బలాన్ని, నైపుణ్యాన్ని ప్రదర్శిస్తాయి. అభిమానులు సోషల్ మీడియాలో తమ తమ జట్లను ఉత్సాహపరుస్తున్నారు. మ్యాచ్ గురించి తమ భావాలను వ్యక్తం చేస్తున్నారు. 2025 ఆసియా కప్‌లో భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ గురించి ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ డైరెక్టర్స్ అసోసియేషన్ (IFTDA) అధ్యక్షుడు అశోక్ పండిట్ మాట్లాడుతూ..…
India’s Big Sports Day: క్రీడా ప్రియులకు ఆదివారం ఒక పండగే. ఎందుకంటే.. రేపు భారత్ రెండు వేర్వేరు శత్రు దేశాల జట్లతో తలపడనుంది. ఒక వైపు, దుబాయ్‌లో జరిగే ఆసియా కప్ క్రికెట్ మ్యాచ్‌లో టీం ఇండియా పాకిస్థాన్‌తో తలపడనుంది. మరోవైపు, మహిళల హాకీ ఆసియా కప్ టైటిల్ పోరు హాంగ్‌జౌ గడ్డపై జరుగుతుంది. భారత హాకీ జట్టు ఆతిథ్యం ఇచ్చిన చైనాతో తలపడనుంది. క్రికెట్, హాకీ రెండు వేర్వేరు ఆటలు అయినప్పటికీ.. ఆసియాలోని రెండు…
భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ లపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. భారత జట్టు పాకిస్తాన్‌కు వెళ్లదని, పాకిస్తాన్ జట్టును కూడా భారతదేశానికి రావడానికి అనుమతించబోమని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు , ఆసియా కప్, ఐసిసి టోర్నమెంట్లు వంటి బహుళ-దేశాల టోర్నమెంట్లను విడివిడిగా పరిగణిస్తారు. ఈ టోర్నమెంట్లు తటస్థ వేదికలో జరిగితే భారతదేశం వాటిలో పాల్గొనవచ్చు. భారత విధానంలో ఎటువంటి మార్పు లేదని, పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాలను పునరుద్ధరించే ప్రశ్నే లేదని…