India vs England: వరుణుడి అంతరాయం.. దెబ్బకు లంచ్ బ్రేక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రీషెడ్యూల్ మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించాడు. నిజానికి.. మ్యాచ్ ప్రారంభం అవ్వడానికి ముందునుంచే వాతావరణంలో తేడాలు కనిపించడంతో, వర్షం రావొచ్చని అంచనా వేశారు. అనుకున్నట్టే.. వరుణుడు కారుమబ్బుల్ని వెంటేసుకొని వచ్చాడు. తొలుత కాసేపు బ్రేక్ ప్రకటించిన అంపైర్లు.. వాతావరణ మార్పుల దృష్ట్యా లంచ్ బ్రేక్‌గా ప్రకటించారు. వర్షం ఆగిన తర్వాత మ్యాచ్‌ని తిరిగి ప్రారంభించనున్నారు. లంచ్ బ్రేక్ సమయానికి భారత్ 2 వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది.
తొలుత టాస్ గెలిచిన ఇంగ్లండ్.. బౌలింగ్ ఎంపిక చేసుకోవడంతో బ్యాటింగ్ చేసేందుకు భారత్ రంగంలోకి దిగింది. తొలుత ఓపెనర్లు క్రీజులో కుదుర్కుకున్నట్టు అనిపించారు కానీ.. అండర్సర్ బౌలింగ్‌లో శుభ్మన్ గిల్ (17) అనూహ్యంగా ఔట్ అయ్యాడు. క్రాలేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. కాసేపయ్యాక పుజారా (13) సైతం ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ (1), హనుమ విహారి (14) ఉన్నారు. ఇకపై వికెట్లు కోల్పోకుండా భారత్ నిలకడగా రాణిస్తే.. ఇంగ్లండ్ బౌలర్లపై ఒత్తిడి పెంచినట్లవుతుంది.
Also Read
- Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
- IND vs WI 2026: మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల.. సెప్టెంబర్ 27 నుంచే..
కాగా.. గతేడాదిలోనే జరగాల్సిన ఈ మ్యాచ్‌ను కరోనా కారణంగా ఈ ఏడాది జులై 1కి రీషెడ్యూల్ చేశారు. ఈ ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఇప్పటివరకూ నాలుగు మ్యాచ్‌లు పూర్తవ్వగా.. ఒకటి డ్రాగా ముగిసింది. ఇంగ్లండ్ ఒకటి గెలవగా.. రెండు విజయాలతో భారత్ ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్ డ్రాగా ముగిసినా, భారత్ గెలిచినా.. సిరీస్ భారత్‌దే. ఒకవేళ ఇంగ్లండ్ గెలిస్తే.. 2-2తో సిరీస్ సమం అవుతుంది.
తాజావార్తలు
-
The Paradise : నాని ‘ది ప్యారడైజ్’ సెన్సార్.. ‘A’ సర్టిఫికెట్
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే.. డబ్బే డబ్బు!
-
Fauzi Release Date: ప్రభాస్ ‘ఫౌజీ’కి మరోసారి బ్రేక్.. డిసెంబర్ 3 మిస్ అయితే కొత్త రిలీజ్ డేట్ ఇదేనా?
-
NTR Bharosa Pension: వారికి గుడ్ న్యూస్.. పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగింపు..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?