Post Office: తపాలా శాఖ ఎప్పటికప్పుడు తన కస్టమర్ల కోసం నూతన పథకాలు రూపొందిస్తుంది. అలాగే తాజాగా తపాలా శాఖ వినూత్న రీతిలో టాటా ఏఐజి ఇన్సూరెన్స్ సంస్థ ఆధ్వర్యంలో పేద, బడుగు, బలహీన వర్గాలకు అందుబాటులో ఉండే విధంగా గ్రూప్ యాక్సిడెంట్ కార్డు పాలసీని రూ.399 కే అందుబాటులోకి తెచ్చిందని,ఈ పాలసీ ద్వారా ఎలాంటి ప్రమాదం సంభవించినా బీమా తీసుకున్నప్పటి నుంచి ఏడాది పాటు రూ.10 లక్షల బీమా కవరేజీ వర్తిస్తుంది.
Today (16-02-23) Business Headlines: ఏప్రిల్ 1 నుంచే ఐటీఆర్‌లు: ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్‌లను ఏప్రిల్ ఒకటో తేదీ నుంచే దాఖలు చేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. 2023-24 అసెస్‌మెంట్ ఇయర్ మొదటి రోజు నుంచే ఐటీఆర్ ఫారాలు అందుబాటులో ఉంటాయని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ తెలిపింది. పోయినేడాది ఐటీఆర్ ఫారాలతో పోల్చితే వీటిలో పెద్దగా మార్పులు లేవని పేర్కొంది. కాబట్టి ఐటీఆర్‌లను దాఖలుచేయటం ఇక తేలికని వెల్లడించింది.
పొదుపు ఖాతాదారులకు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) బ్యాడ్ న్యూస్ అందించింది. ఖాతాదారులు పొదుపు ఖాతాల్లో చేసే జమపై వడ్డీ రేట్లను తగ్గించింది. ప్రస్తుతం అమలు చేస్తున్న వడ్డీ రేట్లపై 25 బేసిస్ పాయింట్లు తగ్గించినట్లు ప్రకటించింది. రూ.1 లక్ష వరకు చేసే డిపాజిట్‌పై 2.25% వడ్డీరేటు, రూ.1 లక్ష-రూ.2 లక్షల వరకు జమ చేసే డిపాజిట్లపై 2.50% వడ్డీ మాత్రమే లభిస్తుంది. కొత్త వడ్డీ రేట్లు ఈనెల 1 నుంచే అమల్లోకి వచ్చినట్లు పోస్టాఫీస్…