Ready to War: పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి భారత దేశాన్ని కుదిపేసింది. ఈ ఘటన తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. సోషల్ మీడియాలో యుద్ధం గురించి చర్చలు ఊపందుకున్నాయి. ప్రతీకారం తీర్చుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. కానీ, యుద్ధం అంత సులభమా? ప్రస్తుత పరిస్థితుల్లో యుద్ధం సాధ్యమా? పహల్గామ్ దాడి తర్వాత భారత ప్రజలలో ఆగ్రహం పెల్లుబికుతోంది. పాకిస్తాన్‌కు గుణపాఠం చెప్పాలంటూ చాలా మంది గళమెత్తుతున్నారు. ఓర్పు, సహనం ఇక చాలని.. వన్స్ ఫర్…
పహల్గాం ఉగ్రవాద దాడి అనంతరం భారత్ పాకిస్థాన్‌పై కఠినంగా వ్యవహరిస్తోంది. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా ఉన్న పౌక్ దేశస్థులు ఈనెల 27వ తేదీ(ఆదివారం) లోపు తిరిగి తమ దేశానికి వెళ్లిపోవాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇక మెడికల్ వీసాల మీద వైద్యం కోసం వచ్చిన వారికి మాత్రం మరో రెండు రోజుల సమయం ఇచ్చారు. ఇలాంటి వారు ఈనెల 29వ తేదీ లోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించారు. ఇప్పటికే…
పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత ప్రపంచవ్యాప్తంగా ప్రజలు సంతాపం వ్యక్తం చేశారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. తన హృదయం చాలా విచారంగా ఉందని.. ప్రతి భారతీయుడు కోపంతో మండిపోతున్నారని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రసంగించారు. పహల్గాంలో ఉగ్రవాదులు పిరికితనాన్ని ప్రదర్శించారని విమర్శించారు. శత్రువులకు దేశ అభివృద్ధి నచ్చడం లేదని..
ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి దర్యాప్తును కేంద్ర ప్రభుత్వం జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కి అప్పగించింది. ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా దాని ఫ్రంట్ ఆర్గనైజేషన్ 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్' (TRF) ఈ దాడి చేసినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ దాడి వెు పాక్ హస్తం ఉందనే బలమైన వాదనలు వినిపిస్తున్నాయి.
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత సింధు నదీ జలాల ఒప్పందాన్ని భారతదేశం నిలిపివేయడం వల్ల పాకిస్థాన్ తీవ్ర కలత చెందింది. ప్రతిరోజు ఆదేశానికి చెందిన నాయకులు ఏదో ఒక ప్రకటన విడుదల చేస్తున్నారు. భారతదేశం ప్రతీకార చర్యకు పాకిస్థాన్ భయపడుతుందని అర్థమవుతోంది. తాజాగా పాకిస్థాన్ రైల్వే మంత్రి హనీఫ్ అబ్బాసి భారతదేశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రావల్పిండిలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భారతదేశం పాకిస్థాన్‌కు నీటిని నిలిపివేస్తే, దానికి తగిన సమాధానం ఇస్తామని అన్నాడు.
పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత.. పాకిస్థానీయులను వివాహం చేసుకున్న చాలా మంది భారతీయ మహిళలు ఇబ్బందుల్లో పడ్డారు. పాకిస్థానీ వ్యక్తులను పెళ్లి చేసుకున్న హిందుస్థానీ మహిళలు.. భారత్‌లోని తమ ఇళ్లను విడిచిపెట్టి అత్తమామల ఇళ్లకు(పాక్) వెళ్లడానికి సిద్ధమయ్యారు. అలాంటి అనేక మంది మహిళలను అట్టారి-వాఘా సరిహద్దు వద్ద బీఎస్ఎఫ్ దళాలు నిలిపి వేశాయి. బీఎస్ఎఫ్ ప్రకారం.. పాకిస్థానీయులు దేశం దాడి వెళ్లేందుకు ప్రభుత్వం 48 గంటల కాలపరిమితిని ఇచ్చింది. ఇందులో దాదాపు 287 మంది పాకిస్థానీ…
సింధు జలాల ఒప్పందం నిలిపివేయడం పాకిస్థాన్‌ను ఆగ్రహానికి గురిచేసిందని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పిపిపి) చీఫ్ బిలావల్ భుట్టో జర్దారీ అన్నాడు. నీటిని ఆపడానికి ప్రయత్నిస్తే భారతదేశం దాని పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని భుట్టో పేర్కొన్నాడు. సింధు నాగరికతకు పాకిస్థాన్ నిజమైన సంరక్షకులం తామే అని.. సింధూ నదిలో నీరు పారకపోతే.. భారతీయుల రక్తం పారుతుందని రెచ్చగెట్టే వ్యాఖ్యలు చేశాడు. "సింధు నది మనదే అవుతుంది. మన నీరు దాని గుండా ప్రవహిస్తుంది. లేదా వారి(భారత్) రక్తం…
పహల్గాంలో జరిగిన దాడికి గురించి ప్రపంచం మొత్తం తెలిసింది. ఈ దాడిలో 26 మంది అమాక టూరిస్టులు మృతి చెందడంతో అందరూ భారత్‌కు సపోర్టుగా నిలిచారు. మన దేశంలోని పౌరులు ఈ దాడిపై రగిలి పోతున్నారు. పాక్‌పై కఠినంగా వ్యవహరించాలని, ఇప్పటికైనా శాంతి మంత్రాన్ని పక్కన పెట్టి యుద్ధం ప్రకటించాలని బహిరంగంగానే ప్రకటనలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో సైతం "WewantreRevenge" ట్యాగ్ వైరల్ అయ్యింది. అయితే ఈ దాడిపై శత్రుదేశం పాకిస్థాన్‌లో ఏమనుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం..
దక్షిణ కశ్మీర్‌లోని పహల్గామ్లోని బైసారన్‌లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించారు. ఈ ఉగ్రవాద దాడి తర్వాత, భారతదేశం, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. దాడి తర్వాత భారతదేశం కఠిన చర్యలు తీసుకుంది. సింధు జల ఒప్పందాన్ని రద్దు చేయడంతో సహా అనేక ఆంక్షలు విధించింది. భారతదేశం తీసుకున్న పెద్ద నిర్ణయాల తర్వాత.. పాకిస్థాన్ కూడా నిరంతరం బెదిరింపులు జారీ చేస్తోంది. బయటకు హెచ్చరికలు చేసినా.. నిజానికి పాకిస్థాన్ లోలోపల వణుకుతోంది.…