India-Pakistan Match: చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగేందుకు రంగం సిద్ధమైంది. ఆసియా కప్‌లో భాగంగా ఆదివారం రెండు దేశాల మధ్య ఆసక్తికరపోరు జరుగనుంది. ఇదిలా ఉంటే, మరోవైపు ఈ మ్యాచ్‌ను బహిష్కరించాలని పలువురు కోరుతున్నారు. పహల్గామ్ ఉగ్రదాడితో తమవారిని కోల్పోయిన బాధితులు ఈ మ్యాచ్‌ను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.