Pakistan: ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ చేసిన బ్రహ్మోస్ మిస్సైల్ దాడికి ప్రతిస్పందించడానికి తమకు కేవలం 30-45 సెకన్ల టైమ్ మాత్రమే ఉందని ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సహాయకుడు రాణా సనావుల్లా అన్నారు. బ్రహ్మోస్ క్షిపణిలో అణు వార్‌హెడ్ ఉంటుందో లేదో తెలుసుకునేందుకు తక్కువ సమయం ఉన్నట్లు ఆయన అంగీకరించారు.
Pakistan: భారత్ దెబ్బకు పాకిస్తాన్ చైనా ఆయుధాలు, పరికరాలను నమ్మలేకపోతోంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను భారత్ స్వదేశీ తయారీ ‘‘ఆకాష్ ఎయిర్ డిఫెన్స్’’ సిస్టమ్‌తో పాటు డ్రోన్ల అడ్డుకునే ఆయుధాలు సమర్థవంతంగా, 100 శాతం ఖచ్చితత్వంతో పనిచేశాయి.
ఈ నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం వస్తే ఇరు దేశాల బలాబలాలు, ఏ దేశం ఎటువైపు నిలుస్తుందనేది ఆసక్తిగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా శక్తివంతమైన సైన్యాలను లిస్ట్ చేసే గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ -2025 ప్రకారం, చూస్తే అన్ని విభాగాల్లో పాకిస్తాన్‌కి అంతనంత ఎత్తులో భారత్ ఉంది.