Iran's strikes in Pakistan: పాకిస్తాన్‌పై ఇరాన్ దాడి చేసింది. బలూచిస్తాన్ లోని కీలమైన రెండు ప్రాంతాలపై వైమానికి దాడులకు పాల్పడింది. దీనిపై భారత్ స్పందించింది. ఇది రెండు దేశాలకు సంబంధించిన విషయమని, ఉగ్రవాదం పట్ల ఇరాన్ స్పందించిందని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇరాన్ తన ఆత్మరక్షణ కోసం దాడులు చేసినట్లు భారత్ అర్థం చేసుకుంటుందని తెలిపింది. ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ వైఖరిని భారత్ మరోసారి నొక్కి చెప్పింది.