Maldives: మాల్దీవుల్లో కొత్త అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు వచ్చిన తర్వాత నుంచి భారత్ వ్యతిరేఖ, చైనా అనుకూల ధోరణిని అవలంభిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి మంత్రులు భారత ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. మాల్దీవ్స్‌కి పర్యాటకంగా ఎక్కువ వెళ్లే భారతీయులు వారి టూర్లను క్యాన్సిల్ చేసుకున్నారు. ‘‘బాయ్‌కాట్ మాల్దీవులు’’ హ్యాష్‌ట్యాగ్‌ని ట్రెండ్ చేశారు. ఈ వివాదంతో మాల్దీవ్స్ పర్యాటక ఇండస్ట్రీ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది.
India-Maldives: మాల్దీవులు, ఇండియా మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. కొత్తగా ఎన్నికైన ఆ దేశ అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ భారతదేశానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ, ప్రో చైనా వైఖరని కనబరుస్తున్నాడు. నిజానికి ఎన్నికైనా ఏ అధ్యక్షుడైనా మొదటగా భారతదేశంలో పర్యటిస్తారు. అయితే, ముయిజ్జూ మాత్రం చైనా పర్యటనకు వెళ్లాడు.
Maldives: భారత్-మాల్దీవుల మధ్య దౌత్య వివాదం నేపథ్యంలో మాల్దీవ్స్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. తమ దేశంలో ఉన్న సైనిక ఉనికిని ఉపసంహరించుకోవాలని భారత్‌ని కోరింది. ఇండియా వ్యతిరేక ధోరణితో పదవికి వచ్చిన అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ, ద్వీపదేశంలోని భారత సైనికులు విడిచివెళ్లాలని కోరుతున్నాడు.
Maldives Row: భారత్-మాల్దీవుల వివాదం నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు మహ్మద్ మయిజ్జూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఐదు రోజుల పర్యటన ముగించుకుని సొంతదేశానికి వచ్చిన ఆయన మాట్లాడుతూ.. మమ్మల్ని వేధించే హక్కు ఏ దేశానికి లేదని, మమ్మల్ని వేధించే లైసెన్స్ మీకు ఇవ్వబడలేదంటూ వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోడీపై మాల్దీవుల మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అనంతరం ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
India-Maldives row: భారత్-మాల్దీవుల మధ్య కొనసాగుతున్న దౌత్య వివాదం నేపథ్యంలో భారత వ్యాపార సంఘమైన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) మాల్దీవులతో వ్యాపారం చేయడం మానుకోవాలని కోరింది. ప్రధాని నరేంద్రమోడీపై ఆ దేశ మంత్రులు చేసిన వ్యాఖ్యలు ఆమోదయోగ్యం లేదని వ్యాపార వర్గాలు అన్నాయి. మాల్దీవుల చర్యలకు వ్యతిరేకంగా ఈ బహిష్కరణకు పిలుపునిచ్చింది.
India-Maldives Row: భారత్-మాల్దీవ్స్ మధ్య వివాదం తారాస్థాయికి చేరుకుంది. లక్షద్వీప్ పర్యటన తర్వాత ప్రధాని నరేంద్రమోడీపై ఆ దేశ మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేశారు. మాల్దీవ్స్ స్వాతంత్రాన్ని పొందినప్పటి నుంచి భారత్ అన్ని విధాలుగా ఆపన్న హస్తం అందిస్తున్నా.. ఆ దేశం మాత్రం చైనా పాట పాడుతూనే ఉంది. తాజాగా ‘ఇండియా అవుట్’ అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన అధ్యక్షుడు మహ్మద్ మయిజ్జూ చైనా అనుకూల, భారత వ్యతిరేఖ వైకరి ప్రదర్శిస్తున్నాడు.
Maldives Row: భారత్, ద్వీప దేశం మాల్దీవ్స్ మధ్య తీవ్ర దౌత్య ఘర్షణ చెలరేగుతోంది. ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ లక్షద్వీప్ సందర్శించి, అక్కడి పర్యటకాన్ని ప్రమోట్ చేయడం మాల్దీవ్స్ ప్రభుత్వానికి నచ్చడం లేదు. దీంతో అక్కడి మంత్రులు ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వివాదం తారాస్థాయికి చేరుకుంది. ఇక భారతీయుల దెబ్బకు ‘బాయ్‌కాట్ మాల్దీవ్స్’ హాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. మరోవైపు మోడీపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రుల్ని అక్కడి ప్రభుత్వం సస్పెండ్ చేసింది.