మన దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా కరోనా బులిటెన్‌ను విడుదల చేసింది. ఈ బులిటెన్ ప్రకారం, గడిచిన 24 గంటల్లో ఇండియాలో 34,403 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,33,81,728 కి చేరింది. ఇందులో 3,25,98,424 మంది కోలుకొని డిశ్చార్జ్‌కాగా, 3,39,056 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక, గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 320 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటి వరకు మొత్తం 4,44,248 మంది కరోనాతో మృతి చెందారు. ఒక్క రోజులో దేశంలో 37,950 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.