సార్వత్రిక ఎన్నికల్లో ఈసారి ఎలాగైనా బీజేపీని దెబ్బకొట్టాలన్నారు. వ్యతిరేక ఓట్లు చీలకూడదంటే విపక్షాలన్నీ ఏకధాటిపైకి రావాలనుకున్నాయి. అంతే తడువుగా ఆయా రాజకీయ పక్షాలు ఏకతాటిపైకి వచ్చి ఇండియా కూటమిగా ఏర్పాడ్డాయి. అంతేకాదు ఆయా రాష్ట్రాల్లో సమావేశాలు పెట్టి భవిష్యత్ కార్యాచరణపై కూడా చర్చించుకున్నాయి. సీట్లు సర్దుబాటు.. క్యాంపెయిన్, తదితర అంశాలపై బాగానే మేథోమదనం చేశాయి. ప్రజల్లో ఒక విధమైన సానుకూల పవనాలు కూడా వీచాయి. ఇంతలో కూటమి తీసుకున్న ఓ నిర్ణయం ఒక్క కుదుపు కుదిపి మూడు…