INDIA bloc: ప్రతిపక్షాల ఇండియా కూటమి తదుపరి సమావేశానికి తేదీ ఖరారైనట్లుగా తెలుస్తోంది. డిసెంబర్ 19న ఢిల్లీ వేదికగా కూటమి నాలుగో సమావేశం జరగబోతోంది. ఈ భేటీకి కాంగ్రెస్ అధ్యక్షత వహించబోతోంది. ముందుగా ఈ సమావేశాన్ని గత బుధవారం నిర్వహించాలని కాంగ్రెస్ భావించింది. అయితే కీలక నేతలైన సీఎం మమతాబెనర్జీ, సీఎం నితీష్ కుమార్, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ వంటి వారు గైర్హాజరు అయ్యే అవకాశం ఉండటంతో ఈ భేటీని రద్దు చేశారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అవినీతికి కేరాఫ్ అంటూ తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో వందల కోట్లు అవినీతికి ప్రజా ప్రతినిధులే పాల్పుడుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు.
INDIA bloc: ఇండియా కూటమి సమావేశానికి తేదీ ఖరారైంది. బుధవారం సమావేశం నిర్వహించాలని కాంగ్రెస్ భావించినప్పటికీ, పలువురు కీలక నేతలు గైర్హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో మరో తేదీన ఇండియా కూటమి సమావేశం నిర్వహించేందుకు సిద్ధమైంది. తాజాగా డిసెంబర్ 17 కూటమి నేతల భేటీ జరుగుతుందని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ మంగళవారం తెలిపారు.
India Bloc: కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి సమావేశానికి పిలుపునిచ్చింది. బుధవారం కూటమి సమావేశానికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. అయితే ఈ సమావేశానికి కీలక నేతలు రావడం లేదు. 5 రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ మూడు రాష్ట్రాల్లో ఓటమి పాలైంది. కేవలం తెలంగాణలో మాత్రమే విజయం సాధించింది. అయితే నేపథ్యంలో కీలక రాష్ట్రాల్లో దారుణ ఓటమి తర్వాత కూటమి సమావేశానికి కాంగ్రెస్ పిలుపునివ్వగా బీహార్ సీఎం నితీష్ కుమార్, సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్…
Congress: 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. తెలంగాణతో పాటు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ దాటింది. తెలంగాణలో 119 స్థానాలకు గానూ 60కి పైగా స్థానాల్లో కాంగ్రెస్ లీడింగ్‌లో ఉంది. అయితే ఛత్తీస్‌గఢ్ విషయంలో కాంగ్రెస్, బీజేపీల మధ్య నువ్వా నేనా అంటూ ఆధిక్యం చేతులు మారుతోంది. అయితే ఆ రాష్ట్రంలోని 90 స్థానాలకు గానూ కాంగ్రెస్ 50 స్థానాల్లో, బీజేపీ 40 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తోంది.
INDIA bloc: 2024 లోకసభ ఎన్నికల్లో ప్రధాని మోడీని, బీజేపీని అడ్డుకునేందుకు దేశంలోని ప్రతిపక్షాలన్నీ కలిసి ఇండియా కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి. అయితే దీనికి సంబంధించి కూటమిలోని పార్టీలన్నీ మూడు సమావేశాలను నిర్వహించాయి. ఇదిలా ఉంటే కొంతకాలంగా ఇండియా కూటమిలోని పలువురు మిత్రపక్షాల నేతలు ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే మధ్యప్రదేశ్ ఎన్నికల్లో తమకు సీట్లు కేటాయించలేదని సమాజ్ వాదీ పార్టీ(చీఫ్) అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ తీరుపై ఆగ్రహంగా ఉన్నారు.
Nitish Kumar: 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని, ప్రధాని నరేంద్రమోడీని అడ్డుకునేందుకు ప్రతిపక్షాలంతా కలిసి ఇండియా కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి. అయితే కొన్ని రోజులుగా ఈ కూటమిలో లుకలుకలు బయటపడుతున్నాయి. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీకి సీట్లు కేటాయించపోవడంపై ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ గుర్రుగా ఉన్నారు.
పలు ప్రతిపక్ష ఎంపీలకు యాపిల్ సంస్థ వార్నింగ్ అలర్ట్ పంపింది. ప్రతిపక్ష ఎంపీల యాపిల్ ఐడీ ఆధారంగా స్టేట్ స్పాన్సర్డ్ అటాకర్స్ తమ ఐఫోన్, ఈ-మెయిల్స్ హ్యాక్ చేస్తున్నట్లు యాపిల్ హెచ్చరించింది. వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించే ప్రమాదం ఉందని, జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రతిపక్ష ఇండియా కూటమిలో అంతర్గత తగాదాలను దురదృష్టకర పరిస్థితి అని అన్నారు.
Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీ, సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ)ల మధ్య మధ్యప్రదేశ్ ఎన్నికలు చిచ్చుపెట్టాయి. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమకు సీట్లు కేటాయిస్తామని చెప్పిన కాంగ్రెస్, మాట తప్పిందని ఎస్పీ చీఫ్, ఉత్తర్ ప్రదేవ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ నేరుగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా మరోసారి ఇరు పార్టీల మధ్య విమర్శలు తలెత్తాయి. లక్నోలోని కాంగ్రెస్ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదానికి కారణమైంది.