Asaduddin Owaisi: దేశంలో థర్డ్ ఫ్రంట్ కు స్థానం ఉందని ఇండియా కూటమిలో భాగస్వామ్యం కాని పార్టీలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ కి సూచించినట్లు ఎంఐఏం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. ఇండియా కూటమి దేశంలోని రాజకీయ శూన్యతను పూరించలేకపోయిందని, కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ కి నాయకత్వం వహిస్తే ఇది భర్తీ అవుతుందని ఆయన అన్నారు.
INDIA Bloc: ఇండియా కూటమి మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో తలపెట్టిన ర్యాలీని రద్దు చేసుకుంది. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ తెలిపారు. ర్యాలీకి సంబంధించి కాంగ్రెస్ చీఫ్ భాగస్వామ్య పార్టీలతో చర్చలు జరుపుతున్నారని, ఎప్పుడు, ఎక్కడ నిర్వహించాలనే దానిపై తుది నిర్ణయం తీసుకోలేదన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సూర్జేవాలా తెలిపారు.
Anurag Thakur: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు, డీఎంకే నేత, రాష్ట్రమంత్రిగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ ‘సనాతన ధర్మం’పై చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహావేశాలు ఇంకా చల్లారడం లేదు. బీజేపీ, కేంద్రమంత్రులు డీఎంకే పార్టీపై ఇండియా కూటమిపై విరుచుకుపడుతున్నారు. తాజాగా కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ శుక్రవారం ఇండియా కూటమిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
INDIA bloc decides to boycott 14 News Anchor’s Shows: నరేంద్రమోడీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పడిన ఇండియా కూటమి గురువారం షాకింగ్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా, బీజేపీకి మద్దతుగా వ్యవహరిస్తున్న మీడియా ఛానెళ్లను, కొంతమంది యాంకర్లను బహిష్కరించాలని ఇండియా కూటమి నిర్ణయించింది. బాయ్‌కాట్ చేయబోయే యాంకర్లు, షోల జాబితాను విపక్ష నేతలు రెడీ చేసుకున్నారు. అందుకు సంబంధించిన పేర్లను ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మెంబర్, మీడియా…
సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఎంకే స్టాలిన్ కుమారుడు, డీఎంకే మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యను తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) సోమవారం ఖండించింది. ప్రతిపక్ష నేతృత్వంలోని భారత కూటమికి అలాంటి వ్యాఖ్యలతో సంబంధం లేదని పేర్కొంది.
త్తర ప్రదేశ్‌లోని ఘోసీ అసెంబ్లీ ఉప ఎన్నిక ద్వారా ఎన్డీయే - ఇండియా కూటముల మధ్య తొలి ఎన్నికల పోరు ప్రారంభమవుతోంది. ప్రతిపక్ష ఇండియా కూటమి భవిష్యత్ ఎన్నికలలో సాధ్యమైనంత వరకు కలిసి పోటీ చేస్తామని చెప్పిన కొన్ని రోజుల తర్వాత.. 28 మంది సభ్యుల కూటమి మొదటి పరీక్షను ఎదుర్కొంటోంది.
కేంద్రం ఏర్పాటు చేసిన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు లోక్‌సభ ముందస్తు ఎన్నికలకు నాంది కావచ్చని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అన్నారు. ముంబైలో రెండు రోజుల ఇండియా కూటమి సమావేశంలో పాల్గొన్న తర్వాత పాట్నా విమానాశ్రయంలో దిగిన నితీష్ కుమార్.. సెప్టెంబర్ 18 మరియు 22 మధ్య ప్రభుత్వం పిలిచిన ప్రత్యేక సమావేశాలపై స్పందించారు.
బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతి ఎవరితో ఉన్నారనే దానిపై ప్రశ్నార్థకంగా ఉందని, ఆమె బీజేపీతో పొత్తు పెట్టుకుందనే ఊహాగానాలు ఉన్నాయని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ బుధవారం అన్నారు.