దేశ రాజధాని ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశం అయింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో భారత కూటమి సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి కూటమిలో ఉన్న పార్టీ అధినేతలు, నాయకులు పాల్గొన్నారు.
భారత దేశంలో ఈరోజు చివర దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఇదిలావుండగా, 57 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఇక, ఓటర్లను ఉద్దేశించి రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
M Kharge: రేపటిలో సార్వత్రిక ఎన్నికల సంగ్రామం ముగుస్తోంది. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. మోడీ నేతృత్వంలో ఎన్డీయే కూటమి మరోసారి అధికారంలోకి వస్తుందని బీజేపీ పార్టీ భావిస్తుంటే, ఈ సారి బీజేపీని గద్దె దించుతామని ఇండియా కూటమి ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
దేశ వ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి గురువారంతో ఫుల్ స్టాప్ పడింది. ప్రచార మైకులన్నీ మూగబోయాయి. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన దగ్గర నుంచి ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలు ప్రచారాల్లో మునిగిపోయారు.
ఏడో దశ ఎన్నికలకు ముందు ప్రతిపక్షాలను టార్గెట్ చేసిన నరేంద్ర మోడీ.. గత 24 ఏళ్లుగా విపక్షాలు తనపై దౌర్జన్యం చేస్తున్నాయని అన్నారు. ఎన్నికలు జరిగినా, జరగకపోయినా.. ఈ వ్యక్తులు (ప్రతిపక్షాలు) దుర్వినియోగం చేసేందుకే ఇష్టపడుతారని విమర్శించారు.
విపక్ష ఇండియా కూటమి జూన్ 1వ తేదీన ఢిల్లీలో సమావేశం కాబోతుంది. ఈ మీటింగ్‌కు రావాల్సిందిగా కూటమిలోని అన్ని పార్టీలకు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఇప్పటికే సమాచారం ఇచ్చారు.
Arvind Kejriwal: లోక్‌సభ ఎన్నికల తర్వాత ఇండియా కూటమి అధికారంలోకి వస్తే తాను తదుపరి ప్రధాని కాగలననే ఊహాగానాలకు ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తెరదించారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇండియా కూటమితో పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం పన్స్కురాలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న దీదీ.. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో తమ పార్టీ తృణమూల్ కాంగ్రెస్‌కు అత్యధిక సీట్లు వస్తే.. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే భారత కూటమికి పూర్తిగా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు.
Congress: ఇండియా కూటమికి బయట నుంచి మద్దతు ఇస్తానని ఇటీవల బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించింది. అయితే, ఆమె ప్రకటనపై బెంగాల్ కాంగ్రెస్ చీఫ్ అధిర్ రంజన్ చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు.
INDIA Bloc: ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించి, ప్రధాని నరేంద్రమోడీని గద్దె దించాలని ప్రతిపక్ష పార్టీలన్నీ ఇండియా కూటమి పేరుతో ఏకమయ్యాయి. కూటమి పెట్టిన సమయంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) కూడా కూటమిలో భాగంగా ఉన్నప్పటికీ,