Mallikarjun Kharge: 2024 లోక్‌సభ ఎన్నికలు విజయవంతంగా ముగిశాయి. ఏప్రిల్ 19న మొదలైన పోలింగ్ ప్రక్రియ ఈ రోజు (జూన్1)తో ముగిసింది. ఏడు దశల్లో ఎన్నికలు జరిగాయి. ఇదిలా ఉంటే ఈ రోజు ఇండియా కూటమి ఢిల్లీలోని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఇంట్లో సమావేశమైంది. ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేతలు అరవింద్ కేజ్రీవాల్, సంజయ్ సింగ్, సీపీఎం సీతారామ్ ఏచూరి, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తృణమూల్ కాంగ్రెస్ నేతలు కానీ, సీఎం మమతా బెనర్జీ కానీ ఈ మీటింగ్‌కి హాజరుకాలేదు.
Read Also: Heatwave alert: పలు రాష్ట్రాలకు హీట్‌వేవ్ వార్నింగ్
ఇండియా కూటమి కనీసం 295 సీట్లను గెలుచుకుని అధికారంలోకి వస్తుందని ఖర్గే ధీమా వ్యక్తం చేశారు. 295 సీట్ల కన్నా ఎక్కువగానే వస్తాయి కానీ తక్కువ రావని చెప్పారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కేవలం 235 సీట్లకు మాత్రమే పరిమితం అవుతుందన్నారు. ఇండియా కూటమి సంఘటితంగానే ఉందని ఆయన చెప్పారు. ఆర్జేడీ నేత, మాజీ బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ.. ఇండియా కూటమి 295+ స్థానాలను గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ చెబుతున్న 400 సీట్లు అనే నినాదం విఫలమైందని చెప్పారు. ప్రధాని ఎవరనే దాన్ని తర్వాత నిర్ణయిస్తామని చెప్పారు. ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న శివసేన యూబీటీ నేత అనిల్ దేశాయ్ మాట్లాడుతూ.. మహారాష్ట్రలో ఇండియా కూటమి 30-35 సీట్లు గెలుచుకుంటుందని అన్నారు. సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.. బీజేపీ ఉత్తర్ ప్రదేశ్‌లో అన్ని సీట్లలో ఓడిపోతుందని, ఇండియా కూటమి గెలుస్తుందని చెప్పారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల, జీఎస్టీతో భూకంపం వచ్చిందని అన్నారు.