దేశ వ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి గురువారంతో ఫుల్ స్టాప్ పడింది. ప్రచార మైకులన్నీ మూగబోయాయి. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన దగ్గర నుంచి ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలు ప్రచారాల్లో మునిగిపోయారు. మొత్తం ఏడు దశల్లో పోలింగ్ జరుగుతోంది. ఆయా రాష్ట్రాల్లో ఇప్పటికే ఆరు విడతల పోలింగ్ ముగిసి.. నేతలంతా విశ్రాంతి తీసుకుంటున్నారు. తాజాగా చివరి విడత ప్రచారానికి కూడా ముగింపు పలికారు. ఇక ఏడో విడత పోలింగ్ మాత్రమే ముగిలి ఉంది. జూన్ 1న ఓటింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదల కానున్నాయి.
ఇది కూడా చదవండి: Ts Weather: రాష్ట్రంలో భానుడి భగభగ.. ఆదిలాబాద్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు
శనివారం 8 రాష్ట్రాల్లోని 57 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. యూపీ 13, పంజాబ్ 13, పశ్చిమబెంగాల్ 9, బీహార్ 8, ఒడిశా 6, హిమాచల్‌ప్రదేశ్ 4, చండీగఢ్ 1, జార్ఖండ్‌లో 3 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక వారణాసి నుంచి ప్రధాని మోడీ బరిలో ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్ మండీ నుంచి కంగనా రనౌత్ పోటీలో ఉన్నారు. ప్రధాని మోడీ సహా బరిలో 598 మంది అభ్యర్థులు ఉన్నారు.
ఇక ప్రచార ముగింపు సందర్భంగా ప్రధాని మోడీ ఓటర్లకు వీడియో సందేశం విడుదల చేశారు. ‘‘భక్తి, శక్తి, విరక్తికి ప్రతీక కాశీ.. వారణాసి ప్రపంచానికి సాంస్కృతిక రాజధాని.. సంగీతం, శాస్త్రాలకు కాశీ నిలయం.. కాశీ విశ్వనాథుని కృపవల్లే కాశీకి ప్రాతినిథ్యం.. గంగానది నన్ను అక్కున చేర్చుకుంది. జూన్ 1న కాశీ ప్రజలు కొత్త రికార్డు సృష్టించాలి’’ అని ప్రధాని మోడీ విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి: Accident: జమ్మూలో ఘోర ప్రమాదం..150 అడుగుల లోయలోకి బస్సు.. 16 మంది మృతి
ఏప్రిల్ 19న తొలి దశ పోలింగ్ ప్రారంభమైంది. జూన్ 1తో ఏడు దశల పోలింగ్ ముగియనుంది. జూన్ 4న మాత్రం ఎన్నికల ఫలితాలు విడుదలకానున్నాయి. ఇప్పుడు కళ్లలన్నీ ఫలితాలపైనే ఉన్నాయి. ఇప్పటికే మూడోసారి అధికారంలోకి వస్తామని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. అలాగే ఇండియా కూటమి కూడా అంచనా వేస్తోంది. మరీ అధికారం ఎవరిని వరిస్తుందో మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.
ఇది కూడా చదవండి: PM Modi election campaign: 200కి పైగా పబ్లిక్ మీటింగ్స్, 80 ఇంటర్వ్యూలు.. ఎన్నికల ప్రచారంలో మోడీ రికార్డ్..