మారుతి సుజుకి ఇండియా మార్చిలో తన అత్యంత ప్రజాదరణ పొందిన, ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ బాలెనోపై గొప్ప డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ కారుపై కంపెనీ రూ.50,000 వరకు తగ్గింపును అందిస్తోంది. కంపెనీ వినియోగదారులకు నగదు తగ్గింపుతో పాటు ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ బోనస్ వంటి ప్రయోజనాలను అందిస్తోంది. గత నెలలో దేశంలో అత్యధికంగా అమ్ముడైన ఐదవ కారు కూడా ఇదే. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.70 లక్షల నుంచి మొదలవుతుంది.
OLA Electric Bike: ఇండియన్ ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్‌లో తనదైన ముద్ర వేసిన ఓలా ఎలక్ట్రిక్.. ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలో టాప్ పొజిషన్‌లో కొనసాగుతోంది. తమ వినూత్నమైన మోడళ్లతో వినియోగదారులను ఆకట్టుకుంటూ భారీగా అమ్మకాలు సాధిస్తున్న ఈ సంస్థ త్వరలోనే ఎలక్ట్రిక్ బైక్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటన విన్నప్పటి నుంచీ ఆటోమొబైల్ ప్రియులు, ఓలా ఫ్యాన్స్ అందరూ ఈ బైక్ ఎప్పుడు విడుదల అవుతుంది? దీని డిజైన్, ఫీచర్లు ఎలా ఉండబోతున్నాయి? అంటూ సోషల్…
Hero Xoom 160: హీరో మోటోకార్ప్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. టూ-వీలర్ మార్కెట్‌లో ఈ పేరు అందరికీ సుపరిచితమే. ఈ సంస్థ తయారు చేసే వాహనాలకు భారతీయులకు ప్రత్యేక స్థానం ఉంది. ఇకపోతే గత కొద్దిరోజులుగా స్కూటర్ సెగ్మెంట్‌లోనూ హీరో సంస్థ తన ప్రత్యేకతను చూపిస్తోంది. ఇటీవల నిర్వహించిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో హీరో జూమ్ 160 (Xoom 160) స్కూటర్‌ను లాంచ్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. నిజానికి…