3rd Rythu Runa Mafi: మూడో విడత రైతు రుణమాఫీ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఆగస్టు పదిహేనువ తేదీ ఇవాళ ఖమ్మం జిల్లా వైరాలో నిర్వహించే బహిరంగసభలో మూడో విడత రుణమాఫీ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు.
దేశం ఈరోజు 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా 11వ సారి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరించారు.
CM Revanth Reddy: ఉదయం గాంధీభవన్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నుంచి సాయంత్రం రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో భేటీ వరకు సీఎం రేవంత్‌రెడ్డి ఇవాళ అంతా బిజీబిజీగా గడపనున్నారు.
దేశ 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు ఎర్రకోట ప్రాకారంపై నుంచి జాతీయ జెండాను ఎగురవేసి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇది ప్రధాని మోడీ చారిత్రాత్మక మూడో టర్మ్‌లో మొదటి ప్రసంగం కావడం విశేషం.ప్రధాని మోడీ జాతీయ జెండాను ఎగురవేసి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం �
ప్రధానమంత్రి నరేంద్రమోడీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై మువ్వన్నెల జెండాను ఎగురవేయాలని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి కోరారు. ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా.. నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ జాతీయ గీతాలాపన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నార
మూడో విడత రుణమాఫీ రేపు ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. మూడో విడత కింద రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు రుణమాఫీని రేపు ఖమ్మం జిల్లా వైరాలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఆ వెంటనే రైతుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీ మెట్రో సేవల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఆగస్టు 15 ఉదయం 4 గంటలకే సర్వీసులు ప్రారంభమవుతాయని ఢిల్లీ మెట్రో సంస్థ ప్రకటించింది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరయ్యే ప్రజల సౌలభ్యం కోసం ఈ సర్వీసుల్లో మార్పులు చేసినట్లు ఢిల్లీ మెట్రో ప్రకటన చేసింది.
ఆగస్టు 15వ తేదీన అన్న క్యాంటీన్ల ప్రారంభం కానున్నాయి. తొలి విడతలో 100 అన్న క్యాంటీన్లను ప్రభుత్వం ప్రారంభించనుంది. కృష్ణా జిల్లా ఉయ్యూరులో సాయంత్రం ఆరున్నర గంటలకు అన్న క్యాంటీన్ను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు.
ఈసారి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక అతిథులను ఆహ్వానించారు. ఈ ప్రత్యేక అతిథులు 150 మంది మహిళా సర్పంచ్లు. ప్రభుత్వ పథకాలను విజయవంతంగా అమలు చేయడంలో వారు అద్భుతమైన కృషి చేసినట్లు సమాచారం.
Har Ghar Tiranga Certificate 2024: భారతదేశ 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘హర్ ఘర్ తిరంగ’ ప్రచారం ఆగస్టు 9న ప్రారంభమైంది. ఇది ఆగస్టు 15 వరకు కొనసాగుతుంది. 2022లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ప్రారంభించబడిన ఈ కార్యక్రమం విస్తృతంగా పాల్గొనడం ద్వారా జాతీయ ఐక్యతను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏ�