3rd Rythu Runa Mafi: మూడో విడత రైతు రుణమాఫీ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఆగస్టు పదిహేనువ తేదీ ఇవాళ ఖమ్మం జిల్లా వైరాలో నిర్వహించే బహిరంగసభలో మూడో విడత రుణమాఫీ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. వైరా సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు చెక్కులు పంపిణీ చేయనున్నారు. మూడో విడతలో 14.45 లక్షల మంది రైతులకు రుణమాఫీ జరగనుంది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి తో పాటు.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొంటారు. రెండు లక్షల రుణమాఫీ పథకంను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. కమలాపురం వద్ద మూడవ పంప్ హౌస్ ను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రారంభించనున్నారు. బిజీ కొత్తూరు వద్ద మొదటి పంపు హౌస్ ను జిల్లా ఇన్చార్జ్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించనున్నారు.
Read also: CM Revanth Reddy: నేడు 78వ స్వాతంత్య్ర దినోత్సవం.. సీఎం రేవంత్ రెడ్డి బిజీ షెడ్యూల్..
ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా రూ.2 లక్షల కేటగిరీలోని రైతుల ఖాతాల్లో రుణమాఫీ సొమ్ము జమ అవుతుంది. ఇదిలా ఉండగా జూలై 18న తొలి విడతలో రూ.లక్ష వరకు బకాయిలున్న 11,34,412 మంది రైతులకు రూ.6,035 కోట్ల రుణమాఫీ చేశారు. తర్వాత జూలై 30న రెండో విడతలో రూ.1.50 లక్షల కేటగిరీలోని 6,40,823 మంది రైతులకు రూ.6,190 కోట్లు మాఫీ చేశారు. మొత్తం 17,75,235 మంది రైతులకు రెండు విడతలుగా రూ.12,225 కోట్ల రుణమాఫీ చేశారు. మూడో విడతలో మరో 6 లక్షల మందికి రుణమాఫీ చేస్తే.. రుణమాఫీ పొందిన రైతుల సంఖ్య 23.75 లక్షలు దాటనుంది. మొత్తం రూ.18 వేల కోట్లకు పైగా మాఫీ అవుతుంది. ఇది రుణ మాఫీ యొక్క కీలక దశను పూర్తి చేస్తుంది. రుణమాఫీ కోసం రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు రుణాలు తీసుకున్న రైతులకు నిధులు మంజూరయ్యాయి.
Read also: Traffic Alert: అలర్ట్.. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు
ఈ కేటగిరీలో దాదాపు 6 లక్షల మంది రైతులు ఉండగా, వారి రుణాలను మాఫీ చేసేందుకు దాదాపు రూ.6 వేల కోట్లు కావాలి. ఇందుకోసం ఆర్‌బీఐ నిర్వహించిన ఈ-వేలం ద్వారా గత వారం రూ.3 వేల కోట్లు, మంగళవారం మరో రూ.3 వేల కోట్లు మొత్తం రూ.6 వేల కోట్లు ప్రభుత్వం రుణంగా తీసుకుంది. ఈ మొత్తాన్ని మూడో విడత రుణమాఫీకి వినియోగిస్తారు. ఇక రూ.2 లక్షలకు పైగా అప్పులు ఉన్న రైతులు, రేషన్ కార్డులు లేని రైతు కుటుంబాలు, సాంకేతిక సమస్యలతో రుణమాఫీ చేయని అర్హులైన రైతులు మిగిలిపోతారు. వీరికి సంబంధించిన ప్రక్రియ ఈ నెల 15 తర్వాత ప్రారంభమవుతుంది.
Thangalaan Twitter Review: తంగలాన్ ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?