యూఏఈ వేదికగా ఆసియా కప్ 2025 జరుగుతోంది. బుధవారం యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయంలో మూగ్గురు కీలక పాత్ర పోషించారు. అందులో ఒకడు ఆల్‌రౌండర్ శివమ్ దూబే. రెండు ఓవర్లు వేసిన దూబే.. 4 పరుగులు ఇచ్చి మూడు వికెట్స్ పడగొట్టాడు. 12 బంతుల్లో 10 డాట్ బాల్స్ ఉండటం విశేషం. 2024 టీ20 ప్రపంచకప్‌లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడిన ఈ ఆల్‌రౌండర్.. ఆసియా…
ఆసియా కప్ 2025లో భాగంగా బుధవారం యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన యూఏఈ 57 పరుగులకే ఆలౌటైంది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని భారత్ మరో 93 బంతులు మిగిలిఉండగానే విజయం సాధించింది. అభిషేక్ శర్మ (30: 16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), శుభ్‌మన్ గిల్ (20 నాటౌట్)లు రెచ్చిపోయారు. ఈ మ్యాచ్ ద్వారా అభిషేక్ ఓ అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో…
ఆసియా కప్ 2025లో భాగంగా దుబాయ్ వేదికగా భారత్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) స్వల్ప స్కోరుకే ఆలౌట్ అయింది. భారత బౌలర్ల దెబ్బకు 13.1 ఓవర్లలో 57 పరుగులకే యూఏఈ కుప్పకూలింది. ఓపెనర్లు అలిషామ్ స్కార్ఫ్ (22), ముహమ్మద్ వసీమ్ (19) టాప్ స్కోరర్లు. మిగతా యూఏఈ బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. 3 కంటే ఎక్కువ పరుగులు ఎవరూ చేయకపోవడం విశేషం. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 4, శివమ్ దూబే…
ఆసియా కప్ 2025లో భారత్ తన తొలి మ్యాచ్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)తో తలపడుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం యూఏఈ బ్యాటింగ్ చేస్తోంది. ఈ మ్యాచ్‌కు ముందు బ్యాటింగ్ ప్రాక్టీస్ సందర్భంగా టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ప్రాక్టీస్ సెషన్‌లో సిక్సర్ల మోత మోగించాడు. దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీలో జరిగిన భారత్ ట్రైనింగ్ సెషన్‌లో అభిషేక్ గంట పాటు బ్యాటింగ్ ప్రాక్టీస్…
ఆసియా కప్ 2025లో భాగంగా దుబాయ్ వేదికగా మరికొద్దిసేపట్లో భారత్, యూఏఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. వికెట్ చాలా ఫ్రెష్‌గా ఉందని, రెండో ఇన్నింగ్స్‌లో మంచు పడే అవకాశాలు ఉన్నాయని సూర్య చెప్పాడు. ఇక్కడ 3-4 మంచి ప్రాక్టీస్ సెషన్లు చేశామని చెప్పాడు. అయితే భారత తుది జట్టు అందరి అంచనాలకు బిన్నంగా ఉంది. ఓపెనర్లుగా శుబ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ బరిలోకి దిగనున్నారు.…
ఆసియా కప్ 2025లో భారత్ తన ప్రయాణంను నేడు మొదలెట్టనుంది. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య యూఏఈని టీమిండియా ఢీకొట్టనుంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న భారత్.. ఈసారీ హాట్ ఫేవరెట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. టోర్నీలో పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ ఉన్నా.. భారత్ మాదిరి పటిష్టంగా లేవు. నేడు యూఏఈపై భారత్ భారీ విజయం సాదిస్తుందని అందరూ భావిస్తున్నారు. అయితే టోర్నీ ఆరంభానికి ముందే టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చిక్కుల్లో పడ్డాడు. ఆసియా…
ఆసియా కప్ 2025లో భాగంగా మరికొన్ని గంటల్లో యూఏఈతో భారత్ తలపడనుంది. దుబాయ్ వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. తుది జట్టులో ఎవరుంటారు అనే దానిపై ఇప్పటికే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కోచ్ గౌతమ్ గంభీర్ కసరత్తు చేశారు. ఐదుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లు, ఇద్దరు ఆల్‌రౌండర్లు, నలుగురు బౌలర్లు ప్లేయింగ్ 11లో ఉండే అవకాశాలు ఉన్నాయి. యూఏఈతో మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా కీలక వ్యాఖ్యలు చేశారు. యూఏఈపై…
India Playing 11 vs UAE: ఆసియా కప్ 2025 నిన్న ఆరంభమైంది. టోర్నీని అఫ్గానిస్థాన్ ఘన విజయంతో మొదలు పెట్టింది. టోర్నీ తొలి మ్యాచ్‌లో 94 పరుగుల తేడాతో హాంకాంగ్‌ను చిత్తుగా ఓడించింది. నేడు భారత్ తన తొలి మ్యాచ్‌కు సిద్ధమైంది. దుబాయ్ వేదికగా రాత్రి 8 గంటలకు యూఏఈని ఢీకొట్టనుంది. కీలక పాకిస్తాన్ మ్యాచ్‌కు ముందు సన్నాహకంగా ఈ పోరును వాడుకోవాలని టీమిండియా చూస్తోంది. అయితే టీమిండియా తుది జట్టు ఎలా ఉంటుందనే ఆసక్తి…
ఆసియా కప్ 2025 మరికొన్ని గంటల్లో యూఏఈలో ఆరంభం కానుంది. సెప్టెంబర్ 10న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్ తన మొదటి మ్యాచ్ యూఏఈతో ఆడనుంది. టోర్నీ కోసం టీమిండియా ప్లేయర్స్ గత వారం రోజులుగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆసియా కప్‌లో పాల్గొనే 8 దేశాల కెప్టెన్లు సోమవారం విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. భారత్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తమ సన్నద్ధత గురించి ప్రెస్ మీట్‌లో మాట్లాడాడు. ప్రెస్ మీట్‌లో సూర్యకు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురవగా..…
మరికొన్ని గంటల్లో ఆసియా కప్ 2025 ప్రారంభం కానుంది. ఈరోజు రాత్రి ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్ మధ్య జరిగే మ్యాచ్‌తో టోర్నీ మొదలవనుంది. బుధవారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో యూఏఈతో భారత్ తలపడనుంది. ఆసియా కప్ ప్రారంభం నేపథ్యంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ఆధ్వర్యంలో 8 మంది కెప్టెన్లు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పలు ప్రశ్నలకు జవాబిచ్చాడు. సంజూ శాంసన్‌పై ప్రశ్నకు సూర్య తనదైన శైలిలో రిప్లై…