India vs Canada Preview and Playing 11: టీ20 ప్రపంచకప్ 2024 గ్రూప్-ఏలో భాగంగా నేడు కెనడాను భారత్ ఢీకొట్టనుంది. ఫ్లోరిడాలోని సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియం టర్ఫ్ గ్రౌండ్‌లో ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ఆరంభం కానుంది. భారీ విజయంతో ఘనంగా గ్రూప్ దశను ముగించి.. సూపర్-8కు మరింత జోష్‌తో వెళ్లాలని టీమిండియా చూస్తోంది. కీలకమైన సూపర్ 8కు ముందు ఈ మ్యాచ్‌లో అన్ని విభాగాల్లోనూ రాణించాలి భారత్ భావిస్తోంది. మరోవైపు…