Gowtham Gambhir: న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌లో 0-3తో ఘోర పరాజయం తర్వాత గౌతం గంభీర్ తొలిసారిగా మౌనం వీడాడు. స్వదేశంలో న్యూజిలాండ్‌పై 0-3 తేడాతో ఘోర పరాజయం తర్వాత తాను ఎదుర్కొన్న విమర్శలపై భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ.. భారత కోచ్‌గా గౌరవనీయమైన పాత్రను పోషించడం చాలా కష్టమని, అది తనకు తెలుసునని అన్నాడు. న్యూజిలాండ్‌తో ఓటమి 2012 తర్వాత స్వదేశంలో భారత్‌కు ఇదే తొలి టెస్టు సిరీస్ ఓటమి కాగా..…
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ప్రశంసలు కురిపించాడు. తాను ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బౌలర్ బుమ్రానే అని తెలిపాడు. ప్రపంచంలోనే అన్ని ఫార్మాట్లలో ఆల్‌టైమ్ బెస్ట్ బౌలర్‌గా ఎదుగుతున్నాడన్నాడు. బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగల సామర్థ్యం బుమ్రా సొంతం అని మ్యాక్స్‌వెల్ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా జట్టు, ఐపీఎల్ మ్యాచ్‌లలో చాలాసార్లు బుమ్రా బౌలింగ్‌ను మ్యాక్సీ ఎదుర్కొన్నాడు. ఈఎస్‌పీఎన్-క్రిక్‌ఇన్ఫో షేర్ చేసిన వీడియోలో గ్లెన్ మ్యాక్స్‌వెల్ మాట్లాడుతూ… ‘నేను ఎదుర్కొన్న…
ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌కు చోటు దక్కలేదు. దాంతో సోషల్ మీడియాలో బీసీసీఐ సెలక్షన్ కమిటీపై ట్రోల్స్ వచ్చాయి. రుతురాజ్ యెల్లో జెర్సీ (చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీ) వేసుకోవడం వల్లే ఎంపిక చేయలేదని కామెంట్లు చేశారు. రుతురాజ్‌ను సెలక్ట్ చేయకపోవడంపై టీమిండియా మాజీ క్రికెటర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియా-ఏతో మ్యాచ్‌లకు జట్టును నడిపించే రుతురాజ్.. ప్రధాన టీమ్‌లో చోటు దక్కించుకోలేకపోవడం ఆశ్చర్యంగా…
ఆస్ట్రేలియాపై ఆడాలనేది తన చిన్నప్పటి కల అని తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి తెలిపాడు. ప్రతి క్రికెటర్‌కు దేశం తరఫున టెస్టు క్రికెట్ ఆడటం గౌరవంగా భావిస్తాడని, తనకు ఇప్పుడు అలాంటి అవకాశం రానుండటం ఆనందంగా ఉందన్నాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ నాయకత్వంలో ఎస్‌ఆర్‌హెచ్‌లో ఆడానని, ఇప్పుడు అతడికి వ్యతిరేకంగా బరిలోకి దిగాల్సి ఉంటుందని నితీశ్ చెప్పాడు. ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్‌కు నితీశ్ ఎంపికైన సంగతి తెలిసిందే. పేస్ ఆల్‌రౌండర్ లోటును నితీశ్‌తో…
ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి సత్తాచాటిన విషయం తెలిసిందే. 303 పరుగులు చేసి, 3 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ ప్రదర్శనతో భారత జట్టులోనూ చోటు సంపాదించాడు. ఇటీవల భారత్ టీ20 జట్టులో చోటు దక్కించుకున్న నితీశ్.. ఇప్పుడు టెస్టు జట్టులోనూ స్థానం దక్కించుకున్నాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియాకు వెళ్లే భారత టెస్టు జట్టులో నితీశ్‌కు సెలెక్టర్లు అవకాశం ఇచ్చారు. బంగ్లాదేశ్‌పై తన అరంగేట్ర సిరీస్‌లో నితీశ్ రెడ్డి…
టీమిండియా నయా బ్యాటింగ్ సెన్సేషన్ సర్ఫరాజ్ ఖాన్‌కు రోజురోజుకు మాజీల నుంచి మద్దతు పెరుగుతోంది. సర్ఫరాజ్‌కు ఇప్పటికే భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ సపోర్ట్ చేయగా.. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కూడా మద్దతు ఇచ్చాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో సర్ఫరాజ్‌కు ఛాన్స్ ఇవ్వాలని ఆకాశ్ సూచించాడు. అతడిని పక్కనపెట్టేందుకు కారణం ఏదీ కనిపించడం లేదన్నాడు. ఆస్ట్రేలియా సిరీస్ కోసం ఈ వారంలోగా బీసీసీఐ జట్టును ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. బుధవారం ఓ…
ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున సత్తాచాటిన తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డికి ఇప్పటికే భారత జట్టులో చోటు దక్కిన విషయం తెలిసిందే. ఇటీవల బంగ్లాదేశ్ టీ20 సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైన భారత్-ఏ జట్టులో కూడా మనోడికి చోటు దక్కింది. ఇక అతి త్వరలోనే టెస్టుల్లోకి కూడా ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. భారత్-ఆస్ట్రేలియా మధ్య నవంబర్ 22 నుంచి ఆరంభం కానున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25కి నితీశ్‌ను బీసీసీఐ ఎంపిక చేయనుందని…
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్‌తో సిరీస్‌లో ఆడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. తన అవసరం జట్టుకు ఉందని జట్టు భావిస్తే.. రిటైర్‌మెంట్‌ను వెనక్కి తీసుకుంటానని తెలిపాడు. తన కెరీర్‌ను ఘనంగా ముగించాలని కోరుకుంటున్నా అని వార్నర్ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా జట్టు సరైన ఓపెనర్ లేని లోటుని ఎదుర్కొంటున్న నేపథ్యంలో దేవ్ భాయ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. తాజాగా కోడ్ స్పోర్ట్స్‌తో డేవిడ్ వార్నర్ మాట్లాడుతూ… ‘సెలక్షన్‌కు నేను ఎప్పుడూ…
అక్టోబరు 31న ప్రారంభం కానున్న ఆస్ట్రేలియా పర్యటనకు 15 మంది సభ్యులతో కూడిన భారత్-ఎ జట్టును బీసీసీఐ సోమవారం ప్రకటించింది. మహారాష్ట్ర ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌ను ఇండియా ఎ జట్టుకు కెప్టెన్‌గా సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. గత కొన్ని నెలలుగా భారత జట్టుకు ఎంపిక కాని యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌కు భారత్-ఎ జట్టులో చోటు దక్కింది. ఆంధ్ర యువ క్రికెటర్లు నితీశ్ కుమార్ రెడ్డి,…
ఈ నెలలో భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరగనుంది. అక్టోబర్‌లో న్యూజీలాండ్‌తో భారత్ మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య నవంబర్ నుంచి ఐదు టెస్టుల సిరీస్ ఆరంభం కానుంది. ఈ సిరీస్‌కు మరో రెండున్నర నెలల సమయం ఉంది. అయితే ఇప్పట్నుంచే ఇరు దేశాల మాజీలు మాటల యుద్ధం మొదలు పెట్టారు. రవి శాస్త్రి, రికీ పాంటింగ్, జెఫ్ లాసన్ వంటి మాజీలు తమ…