పాకిస్తాన్ ఆర్ధిక వ్యవస్థ ఎంత దిగజారిపోయిందో చెప్పాల్సిన అవసరం లేదు. పక్కనున్న గల్ఫ్ దేశాలు ఆయిల్, పర్యాటక రంగం పేరుతో సంపాదన పెంచుకుంటుంటే, పాక్ మాత్రం ఉగ్రవాదులకు అండగా ఉంటూ, చైనాకు వత్తాసు పలుకుతూ, ఇండియాని చూసి ఏడుస్తూ పరిస్థితిని దిగజార్చుకుంటోంది. ఇప్పటికే ఆ దేశం పీకలలోతు అప్పుల్లో కూరుకుపోయింది. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం ఏముంటుంది. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ సర్కార్ పరిస్థితి కూడా అలానే ఉన్నది. Read: వైరల్: పెళ్లికొడుకు చేతిలో…
ఉగ్రవాదులకు అండగా ఉండే పాక్, వారిపై సానుభూతిని ప్రదర్శించడం సహజమే. ఆఫ్ఘనిస్తాన్లో తాలీబన్లతో కలిసి పనిచేసేందుకు పాక్ ఇప్పటికే పదివేల మందికి పైగా ముష్కరులను ఆ దేశం పంపినట్టు ఇప్పటికే మీడియాలో వార్తలు వచ్చాయి. ఇక ఇదిలా ఉంటే, ఆఫ్ఘనిస్తాన్లో 70 శాతానికి పైగా భూభాగాన్ని ఆక్రమించుకున్నామని ఇప్పటికే తాలిబన్లు చెప్తూ వస్తున్నాయి. చిన్నారులను, మహిళలను హింసిస్తున్నారు. వేలాది మంది అమాయక ప్రజలను తాలిబన్లు పొట్టన పెట్టుకుంటున్నారు. ఇలాంటి వారిపై పాక్ ఉదారతను ప్రదర్శిస్తున్నది. తాలిబన్లు మిలటరీ…