ప్రధాని మోడీపై ఎంపీ కంగనా రనౌత్ ప్రశంసలు కురిపించారు. ప్రధాని మోడీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ చాలా మెరుగుపడిందన్నారు. ఇప్పుడు మనం మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. పదేళ్ల క్రితం దేశ ఆర్థిక వ్యవస్థపై అందరూ ఆందోళన చెందేవారని కంగనా పేర్కొన్నారు.
జాతీయ పెన్షన్ పథకంలో మార్పులు తీసుకురావడానికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఒక అల్గారిథమ్‌తో ముందుకు వచ్చింది. సవరణలతో ఉద్యోగ వర్గాలను సంతృప్తి పరుస్తూనే .. బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాలను ఇరకాటంలో పడేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
లింగ సమానత్వంలో భారత్ స్థానం మెరుగుపడింది. గత ఏడాది కంటే ఈ ఏడాది 8 స్థానాలు మెరుగుపడింది. గత ఏడాదిలో ప్రపంచ సూచీలో 135వ స్థానంలో ఉండగా.. ఈ ఏడాది అది కాస్త 127వ స్థానంలోకి వచ్చింది.