దానా తుఫాన్ తీరం వైపు దూసుకొస్తోంది. ఈ తుఫాన్ పెను బీభత్సం సృష్టించనుంది. ఈ మేరకు భారత వాతావరణ శాఖ ఇప్పటికే ఆయా రాష్ట్రాలను అలర్ట్ చేసింది. ప్రాముఖ్యంగా పశ్చిమబెంగాల్, ఒడిశాపై తీవ్ర ప్రభావం చూపనుంది. ప్రస్తుతం ఇది పారాదీప్‌కు ఆగ్నేయంగా 460 కి.మీ, ధమ్రాకు 490 కి.మీ, సాగర్ ద్వీపానికి 540 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. గురువారం (అక్టోబర్ 24) తెల్లవారుజామున ఒడిశా, బెంగాల్ తీరం దాటే అవకాశం ఉంది. ఇక అక్టోబర్ 25న తీవ్ర తుఫానుగా మారి తీవ్ర అలజడి సృష్టించనుంది. ఇక తీరం దాటే సమయంలో గాలి వేగం గంటకు 110 కి.మీ నుంచి 120 కి.మీ వేగంతో ఉండనుందని ఐఎండీ తెలిపింది.
ఇది కూడా చదవండి: Hyderabad: హైదరాబాద్‌లో గంజాయి అమ్ముతున్న ముగ్గురు మహిళల అరెస్ట్..
వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో బెంగాల్, ఒడిశా ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇంకోవైపు ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు మోహరించాయి. రాష్ట్ర స్థాయి అధికారులు కూడా సిద్ధమయ్యారు. ఇదిలా ఉంటే తుఫాన్ కారణంగా రైల్వేశాఖ అప్రమత్తం అయింది. ముందు జాగ్రత్తగా రైలు సర్వీసులను నిలిపివేసింది. ఈనెల 25 వరకు ట్రైన్ సర్వీసులు ఉండబోవని ఈస్ట్ కోస్ట్ రైల్వే తెలిపింది.
ఇది కూడా చదవండి: Minister Kollu Ravindra: ఇసుక ఎవరికి వారు సొంతంగా లోడ్ చేసుకోవచ్చు..