Heavy Rain: తెలంగాణ రాష్ట్రానికి మరోసారి వర్షాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా మరో నాలుగు రోజులు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెప్పారు.
ఇటీవల ఏపీలో వర్షాలు, వరదలు బీభత్సం సృష్టించాయి. తాజాగా వాతావరణ శాఖ నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఆగ్నేయ దిశగా వాయుగుండం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
భారత వాతావరణ శాఖ ఈ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతాయని హెచ్చరించింది. గంగా నది పశ్చిమ బెంగాల్‌పై లోతైన అల్పపీడనం ఏర్పడిన ప్రభావంతో.. ఈరోజు, రేపు జార్ఖండ్, గంగానది పశ్చిమ బెంగాల్, ఒడిశా, బీహార్‌లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గత 24 గంటల్లో గంగా పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, బీహార్‌లో భారీ నుండి అతి భారీ వర్షపాతం నమోదైంది.
Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీరం దాటేసింది. ఇవాళ (సోమవారం) ఉదయం 11.30 గంటలకు ఒడిశా రాష్ట్రం పూరీ సమీపంలోని గోపాల్‌పుర్ దగ్గర తీరం దాటినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి.. అయితే, కాసేపట్లో పూరీ దగ్గర తీరం దాటనుంది తీవ్ర వాయుగుండం.. భూ ఉపరితలంపై ఇవాళ అర్ధరాత్రి వరకు తీవ్ర వాయుగుండంగా కొనసాగుతూ క్రమేపీ బలహీనపడుతుందని విశాఖపట్నం తుఫాన్ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది..
ఆంధ్రప్రదేశ్లో మరో సారి భారీ వర్షాలు కురవనున్నాయి. రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అల్లూరి సీతారామరాజు, తూర్పూగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలకు కేంద్ర వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కాలువలు, నదులు పొంగి పొర్లుతున్నాయి. తాజాగా ఐఎండీ ఆయా రాష్ట్రాలకు వార్నింగ్ ఇచ్చింది. ఆదివారం 28 రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
High Alert For AP: ఉపరితల ఆవర్తన ప్రభావంతో పశ్చిమ, వాయువ్య బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
Rain Alert: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరోసారి భాతర వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం బలపడుతూ.. అల్పపీడనంగా మారుతుందని ఐఎండీ సూచించింది.
ఈ నెల 5వ తేదీన పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం క్రమేపీ బలపడే అవకాశం ఉందని వాతావరణశాఖ చెబుతుంది.. అల్పపీడనం బలపడటానికి అనుకూలంగా రుతుపవన ద్రోణులు మారుతున్నాయని.. దీని ప్రభావంతో వచ్చే 24 గంటల్లో కృష్ణా జిల్లా.. గుంటూరు జిల్లాలకు మరోసారి వర్షం హెచ్చరికలు జారీ చేసింది..