పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతోందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఓ ప్రకటనలో తెలిపింది. అల్పపీడనం మరింత బలపడి పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ రాగల 12 గంటల్లో (గురువారం తెల్లవారుజాము) వాయుగుండంగా ఏర్పడుతుందని పేర్కొంది. శుక్రవారం (అక్టోబర్ 3) దక్షిణ ఒడిశా-ఉత్తర కోస్తాల మధ్య తీవ్ర వాయుగుండంగా తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది. Also Read: Anirudh Reddy vs KTR: వసూళ్లు, కమీషన్స్, కబ్జాల కోసం కాదు.. కేటీఆర్‌కు జడ్చర్ల ఎమ్మెల్యే…
తెలంగాణ రాష్ట్రంకు వాతావరణ శాఖ భారీ హెచ్చరిక జారీ చేసింది. రానున్న 3 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాలకు వర్ష సూచన ఉన్నట్లు తెలిపింది. ముఖ్యంగా కరీంనగర్, ములుగు, జనగామ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది. తప్పనిసరి అయితేనే బయటికి రావాలని ప్రజలకు సూచింది. Also…
ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి భారీ వర్షాలు కురవబోతున్నాయి.. వాయువ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా.. ఉత్తర కోస్తా మీదగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.. ఇది సముద్ర మట్టం నుంచి 4.5 కిలోమీటర్లు ఎత్తు లో ఆవరించి ఉందని.. దీని ప్రభావంతో రాగల ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని పేర్కొంది విశాఖపట్నం వాతావరణం కేంద్రం..
Mumbai Rains: రాష్ట్రంలో వరద పరిస్థితులపై విపత్తు నిర్వహణ శాఖతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమీక్ష సమావేశం జరిపారు. ఈ సందర్భంగా రాబోయే 48 గంటలు ముంబై, థానే, రాయగడ్, రత్నగిరి, సింధుదుర్గ జిల్లాలకు చెందిన ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
IMD Issues Red Alert for 4 Districts in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని నాలుగు జిల్లాలకు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) రెడ్ అలెర్ట్ జారీ చేసింది. అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలకు ఐఎండీ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. మరో పదకొండు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ…
IMD Issues Orange Alert for Telangana Today: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వానలు కురుస్తున్నాయి. గత వారం రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. జోరు వానలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నేడు కూడా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. భారత వాతావరణ విభాగం (ఐఎండీ)…
Wipha Cyclone: మరో 24 గంటల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ తెలిపింది. విఫా తుఫాన్ చైనా, హాంకాంగ్ ప్రాంతాల్లో బీభత్సం సృష్టించిన తర్వాత.. అది తీరం దాటి బంగాళాఖాతంలోకి ప్రవేశించడంతో.. ప్రస్తుతం ఇది తుఫానుగా మారిపోయింది.
Heavy rains today and tomorrow in Telangana: సోమ, మంగళ వారాల్లో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది. ఆదిలాబాద్, మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, హనుమకొండ, వరంగల్, మెదక్, నాగర్ కర్నూల్, కామారెడ్డి జిల్లాల్లో పలు చోట్ల అతి భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ…
తెలుగు రాష్ట్రాలపై ‘కరువు’ మేఘం కమ్మేస్తోంది. బ్రేక్ మాన్ సూన్ తరహా వాతావరణం కలవరపాటుకు గురిచేస్తోంది. సీజన్లో అత్యంత కీలకమైన జూలై తీవ్ర నిరాశపరిచింది. ఇప్పటికే 10 శాతం వర్షపాతం లోటు నమోదవ్వగా.. వచ్చే వారం పది రోజులు చాలా కీలకమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈలోగా వర్షాలు కురిసి సాధారణ స్ధితికి రాకపోతే పంటలు దెబ్బతినే అవకాశాలు బాగా పెరుగుతాయి. ఈ ఏడాది 9 రోజులు ముందుగానే రుతుపవనాలు వచ్చినప్పటికీ రైతులకు అవసరం అయిన సమయంలో…