రుతుపవనాల ప్రభావం తెలుగు రాష్ట్రాలపై పడింది. మృగశిర కార్తె ప్రారంభం అయి చాలా రోజులు అవుతున్నా సరిగా వానలు పడలేదు. మృగశిర కార్తె వల్ల ముసురు పడుతుంది. వానలు పడతాయని వాతావరణ శాఖ చెప్పినా.. గత కొద్దిరోజులుగా ఎండ వేడితో ఇబ్బందులు పడ్డ బెజవాడ వాసుల్ని వరుణుడు ఎట్టకేలకు కరుణించాడు. వాన కురిపించాడు. భారీవర్షంతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వానజల్లులు కురిశాయి.రహదారులపైకి చేరిన వర్షపు నీటితో పొంగిపొర్లుతున్నాయి డ్రైనేజీలు. గత…
ఆంధ్ర రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు ముంచుకొస్తోంది. బంగాళాఖాతం తూర్పుతీరంలో ఏర్పడిన ఆసాని తుఫాను ఏపీ వైపు దూసుకొస్తుంది. ఈనెల 10 నాటికి తుఫాను రాష్ట్రంలో ప్రవేశిస్తుందని వాతావరణశాఖ తెలిపింది. తీరం దాటే సమయంలో భారీ నష్టం సంభవించే అవకాశం ఉందని హెచ్చరించింది. దక్షిణ అండమాన్ సముద్రంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది వాయువ్యంగా పయనించి వాయుగుండంగా బలపడుతుంది. ఆ తరువాత ఈరోజు సాయంత్రానికి తూర్పుమధ్య…
ఒకవైపు మండే ఎండ, మరోవైపు హఠాత్తుగా చిరుజల్లులతో వాతావరణం చల్లబడుతోంది. ఎండలో తిరిగి అలసిన వారికి చిరుజల్లులు ఉపశమనం కలిగిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మరో రెండ్రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ఏర్పడిందని, రాయలసీమ నుంచి తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని, దీని ప్రభావంతో తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఏపీలో మాత్రం ఎండలు మండుతాయని జాగ్రత్తగా వుండాలని ఐఎండీ సూచించింది. 26వ తేదీ వరకు…
తెలంగాణలో సూరీడు చుర్రుమంటున్నాడు. సాధారణంగా ఏప్రిల్ మొదటి వారం నుంచి ఎండ వేడిమి పెరుగుతుంది. కానీ ఈసారి ఒక నెలముందుగానే ఎండలు పెరిగిపోయాయి. దీంతో బయటకు రావాలంటేనే జనం హడలిపోతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఎండలు మండుతున్నాయి. రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఇక్కడే నమోదవుతున్నాయి. కొమురం భీం జిల్లా కెరమెరిలో 43.9 గా గరిష్ణ ఉష్ణోగ్రతలు నమోదు కాగా వాంకిడిలో 43.8 గా నమోదు అయ్యాయి. అలాగే ఆదిలాబాద్ జిల్లా…
మునుపెన్నడూ లేని విధంగా సూరీడు మండిపోతున్నాడు. ఏప్రిల్ నెలలో ఎండల తీవ్రంగా వుంటాయని వాతావరణ నిపుణులు అంటున్నారు. ఇవాళ్టి నుంచి 4 రోజులు తీవ్ర వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. గత నెలలో 122 ఏళ్ల ఉష్ణోగ్రతల రికార్డు బద్దలయ్యాయి. ఈ నెలలో తొలి 10-15 రోజులు ఎండలు మండిపోయే అవకాశం ఉందని, ఆదివారం నుంచి బుధవారం వరకు పలు ప్రాంతాల్లో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని ప్రకటించింది. హిమాలయ పర్వతాల్లోనూ ఈసారి ఉన్నట్టుండి…
వాయుగుండం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురవనున్నాయి. వాతావరణ శాఖ కోస్తాంధ్ర, రాయలసీమకు భారీ వర్ష సూచన చేసింది. అధికారులు, మత్స్యకారులు అప్రమత్తంగా వుండాలని సూచించింది. అండమాన్ సముద్రంలో రేపు మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఈ నెల 17న అల్పపీడనం తీరం దాటనుంది. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురవనున్నాయి. ఇటు ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అన్ని స్కూళ్లు, కాలేజీలకు అధికారులు ఇవాళ సెలవు ప్రకటించారు. మరో 24…