ఏపీలో అక్రమ మైనింగ్ పై అటు మీడియా, పత్రికలు కథనాలు ప్రచురిస్తున్నాయి. ఈ వార్తలపై ఏపీఎండీసీ వైస్ చైర్మన్, ఎండి వెంకటరెడ్డి స్పందించారు. కొన్ని పత్రికల్లో మైనింగ్ అక్రమంగా జరుగుతుంది, ప్రభుత్వానికి చాలా నష్టం వాటిల్లుతుంది అంటూ కథనాలు వస్తున్నాయి.. మైనింగ్ లో ఈ ప్రభుత్వం ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చింది..ఈ ఆప్షన్ ను తీసుకువచ్చాం..గత ప్రభుత్వంలో ఏడాదికి 1900 కోట్లు ఆదాయం వస్తే, ఈ ప్రభుత్వంలో ఈ ఏడాది 4200 కోట్లు ఆదాయం వచ్చిందని వెంకటరెడ్డి వివరించారు.
Read Also: Pet Dog: కుక్క యజమాని బొటనవేలును కొరికేసింది.. అదే అతడికి వరమైంది!
2014 నుండి 2019 వరకు అక్రమ రవాణాపై కేసులు నమోదు అయితే, 2019-23 వరకు 786 కేసులు నమోదు చేశాం.. అక్రమ మైనింగ్ వ్యవహారాల్లో ప్రజాప్రతినిధులపై సైతం కేసులు నమోదు చేశాం..అక్రమ మైనింగ్ పై ఉక్కుపాదం మోపుతున్నాం.. ఎవరిని విడిచిపెట్టేది లేదు..2019 లో ప్రకాశం జిల్లాలో 90 క్వారీలపై కేసులు నమోదు చేసి 2000 కోట్లు పెనాల్టీ వేసాం అన్నారు ఏపీ ఎండీసీ ఛైర్మన్ వెంకటరెడ్డి.
Read Also: Bhatti Vikramarka : అధికారంలోకి వచ్చాక.. రైతులకు ఒక దఫాలో రూ.2లక్షల రుణ మాఫీ చేస్తాం