సీనియర్ హీరో మోహన్ బాబు “సన్ ఆఫ్ ఇండియా”తో థియేటర్లలో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధంగా ఉన్నారు. డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో నిజ జీవిత సంఘటల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 18న సినిమా హాళ్లలో సందడి చేయనుంది. ప్రస్తుతం మేకర్స్ సినిమా ప్రొమోషన్లపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే నిన్న “సన్ ఆఫ్ ఇండియా” ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.
Read Also : Son of India : అలీపై షాకింగ్ కామెంట్స్… సునీల్ ను ఇరికించిన మోహన్ బాబు
ఈ కార్యక్రమంలో మోహన్ బాబు మాట్లాడుతూ కాసేపు స్టేజ్ పై అందరినీ నవ్వించారు. ముందుగా మోహన్ బాబు తన భార్య ఇంట్లోనే కాకుండా ఇక్కడ కూడా కాలు మీద కాలేసుకుని కూర్చుందని, కాస్త దించితే బాగుందని అన్నారు. ఆ తరువాత ఇంట్లో భార్యలకు భయపడతారు… మీరంతా అంతే కదా అంటూ అలీని అడిగారు. ఆ ప్రశ్నకు అలీ నవ్వుతుండగా లైవ్ జరుగుతోంది మీకు సభ్యత, సంస్కారం, మర్యాద లేదా అంటూ అలీని పక్కకు నెట్టేశారు. ఈ సరదా సన్నివేశం అక్కడున్న అందరినీ నవ్వించింది. ఇక మోహన్ బాబు సినిమా గురించి ఇంకా ఏం మాట్లాడారో ఈ వీడియోలో చూడండి.