కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రధాన పాత్రలో డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం “సన్ ఆఫ్ ఇండియా”. మంచు విష్ణు నిర్మాణంలో నిజజీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ ఫిబ్రవరి 18న విడుదల కానుంది. ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. “సన్ ఆఫ్ ఇండియా” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్రం బృందంతో పాటు మంచు లక్ష్మి, మంచు విష్ణు, పోసాని కృష్ణ మురళి, అలీ, సునీల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సునీల్ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అయితే అదే సమయంలో అలీ, పోసానిపై సునీల్ కామెంట్స్ చేసినట్టు మోహన్ బాబు వెల్లడించారు. అలీ, పోసాని తనకంటే బాగా నటించలేరని చెప్పాడని చెప్పి సునీల్ ని మోహన్ బాబు ఇరికించారు. అయితే ఇదంతా సరదాకే కావడంతో అక్కడున్న అందరి మొహాల్లో చిరునవ్వు సందడి చేసింది.
Read Also : Posani : పరుచూరి బ్రదర్స్ లా మాత్రం బతకొద్దు అనుకున్నా…