ప్రస్తుతం ప్రపంచ ఆర్ధిక మాంద్యం దృష్ట్యా పెద్ద టెక్ కంపెనీలు, అలాగే అనేక బహుళజాతి కంపెనీలు వారి ఉద్యోగులను పెద్ద ఎత్తున తొలగిస్తున్న సంగతి ప్రతిరోజు చూస్తున్నాము. ఇకపోతే ప్రపంచ ఖ్యాతి పొందిన ఐఐటీ లాంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో కూడా ఇంజనీరింగ్ పూర్తి చేస్తున్న విద్యార్థులకు కూడా ప్లేస్ మెంట్స్ దొరకని పరిస్థితి. కొన్ని రోజుల్లో 2024 బ్యాచ్ ఇంజనీరింగ్ కోర్స్ పూర్తికానుంది. ఈ సమయంలో నిజానికి ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో అనేక కంపెనీల ప్లేస్మెంట్స్…
Breath Can Be Used To Unlock Smartphones: స్మార్ట్‌ఫోన్‌ను అన్‌లాక్ చేయాలంటే.. సాధారణంగా మనం ప్యాటర్న్, నంబర్స్, ఫింగర్ లేదా ఐరిస్ ఉపయోగిస్తాం. ఇకపై శ్వాస (బ్రీత్)తో కూడా ఫోన్ అన్‌లాక్ చేయొచ్చు. శ్వాసతో స్మార్ట్‌ఫోన్‌ను అన్‌లాక్ చేసే దిశగా ఐఐటీ మద్రాస్‌లోని అప్లైడ్ మెకానిక్స్ మరియు బయోమెడికల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ మహేష్ పంచాగ్నుల నేతృత్వంలోని పరిశోధనా బృందం టెక్నాలజీని అభివృద్ధి చేస్తోంది. ఈ శ్వాస పరిజ్ఞానాన్ని ఆచరణాత్మక అప్లికేషన్‌లుగా అభివృద్ధి చేశాక..…
అన్ని వర్గాల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ అన్నారు.
IIT Madras: దేశంలో అత్యున్నత విద్యాసంస్థ మరోసారి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), మద్రాస్ ర్యాంక్ సాధించింది. వరసగా ఐదో ఏడాది కూడా అగ్రస్థానంలో కొనసాగుతోంది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ 2023లో దేశంలోని వివిధ విద్యాసంస్థలకు ర్యాంకుల్ని కేటాయించింది.
చెన్నైలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని విద్యార్థులు వరుసగా ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపుతోంది. ఈ ఏడాది ఇప్పటికే ముగ్గురు విద్యార్థులు మృతి చెందగా.. తాజాగా మరో విద్యా్ర్థి సూసైడ్ చేసుకున్నారు.
IIT-Madras PhD Student Dies By Suicide: దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యాసంస్థ ఐఐటీ-మద్రాస్. ఎంతో మందిని గొప్పవారిని దేశానికి అందించింది. అయితే ఇటీవల మాత్రం తరుచు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనలతో వార్తల్లో నిలుస్తోంది. తాజాగా మరో విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మద్రాస్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పీహెచ్డీ చేస్తున్న పశ్చిమ బెంగాల్ కు చెందిన 32 ఏళ్ల విద్యార్థి సచిన్ వేలచ్చేరిలోని తన గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఇటీవల కాలంలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. పరీక్షల్లో ఫెయిల్ అవ్వడం, చదువు ఒత్తిడి, ప్రేమ విఫలం, తదితర కారణాలతో నేటి యువత బలవన్మరణానికి పాల్పడుతున్నారు. తాజాగా పీహెచ్‌డీ చేస్తున్న ఐఐటీ మద్రాస్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.
Student Suicide: రాజస్థాన్ కోటాలో మెడికల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ పరీక్షకు కోచింగ్ తీసుకుంటున్న 18 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. హాస్టల్ గదిలోనే ఉరేసుకుని మరణించింది. తక్కువ మార్కులు వస్తున్నాయన్న మనస్తాపంలోనే తమ కుమార్తె ఈ అఘాయిత్యానికి ఒడిగట్టిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
IIT Student Suicide: ఐఐటీ విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఐఐటీ మద్రాస్ లో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థి మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 20 ఏళ్ల పుష్పక్ అనే విద్యార్థి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం తన హాస్టల్ గదిలో ఉరేసుకుని చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. తన మరణంపై విచారణ చేయవద్దని సూసైట్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.