ఇటీవల కాలంలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. పరీక్షల్లో ఫెయిల్ అవ్వడం, చదువు ఒత్తిడి, ప్రేమ విఫలం, తదితర కారణాలతో నేటి యువత బలవన్మరణానికి పాల్పడుతున్నారు. తాజాగా పీహెచ్‌డీ చేస్తున్న ఐఐటీ మద్రాస్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఐఐటీ మద్రాస్‌లో సచిన్ కుమార్ జైన్ అనే 32 ఏళ్ల యువకుడు పీహెచ్‌డీ చేస్తున్నాడు. వేలచేరిలోని తన ఇంట్లో శవమై కనిపించాడు. ఆత్మహత్యకు ముందు సచిన్ కుమార్ జైన్, వాట్సాప్‌లో “నన్ను క్షమించండి, ఇది సరిపోదు” అని స్టేటస్ పెట్టాడు.
Also Read:Ashok Gehlot : ఖలిస్తాన్‌పై అమృతపాల్ ధైర్యం అదే.. కారణం చెప్పిన రాజస్థాన్ సీఎం
పశ్చిమ బెంగాల్‌కు చెందిన జైన్, ఐఐటీ మద్రాస్‌లోని గిండీ క్యాంపస్‌లోని మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో పీహెచ్‌డీ చేస్తున్నాడు. రోజులాగే ఉదయం తన రెగ్యులర్ క్లాస్‌లకు వెళ్లి, ఎవరికీ సమాచారం ఇవ్వకుండా తన అద్దె నివాసానికి తిరిగి వచ్చాడు. ఒక గంట తర్వాత అతను కనిపించడం లేదని సచిన్ కుమార్ జైన్ స్నేహితులు గుర్తించారు. జైన్ కోసం అతని నివాసానికి వెళ్లారు. అయితే, అక్కడ అతను డైనింగ్ హాల్‌లో ఉరివేసుకుని కనిపించాడు. ఈ మేరకు పోలీసులకు సమాచారం అందింది. అతని నివాసానికి అంబులెన్స్‌ను పిలిచినప్పటికీ, అత్యవసర బృందం అతను చనిపోయినట్లు ప్రకటించిందని పోలీసులు తెలిపారు. వెలచ్చేరి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఆత్మహత్య కారణాలపై పలు కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు.
Also Read:Molestation: ఇండిగో విమానం ఎయిర్‌హోస్టస్‌తో అసభ్య ప్రవర్తన.. మద్యం మత్తులో రెచ్చిపోయి..