గాజాపై మరోసారి ఇజ్రాయెల్ విరుచుకుపడింది. బుధవారం షెజైయాలో జరిపిన దాడిలో 38 మంది చనిపోయినట్లు పాలస్తీనా ఆరోగ్య అధికారులు తెలిపారు. షెజైయాలోని ఒక భవనంపై ఇజ్రాయెల్ వైమానిక దాడిలో పిల్లలు సహా కనీసం 29 మంది పాలస్తీనియన్లు మరణించారని స్థానిక ఆరోగ్య అధికారులు తెలిపారు.
హమాస్ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులు సాగిస్తోంది. గత సోమవారం నుంచి దాడులను ఉధృతం చేసింది. 400 మందికిపైగా చనిపోయినట్లుగా హమాస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హమాస్ ఇంటెలిజెన్స్ చీఫ్ ఒసామా తబాష్ హతమయ్యాడు. ఈ మేరకు ఐడీఎఫ్ ఎక్స్‌లో పోస్టు చేసింది.
మొత్తానికి ఇజ్రాయెల్-హమాస్ మధ్య బందీలు-ఖైదీల విడుదలకు మార్గం సుగమం అయింది. తొలి దశ కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హమాస్.. ఇజ్రాయెల్ బందీలను విడుదల చేస్తుండగా.. ఇజ్రాయెల్.. పాలస్తీనా ఖైదీలను విడుదల చేస్తోంది.
హమాస్.. మరో ఇద్దరు ఇజ్రాయెల్ బందీలను విడుదల చేసింది. ఇద్దరు బందీలను రెడ్ క్రాస్ సంస్థకు అప్పగించింది. తాల్ షాహమ్, అవెరు మెంగిస్తులను రెడ్ క్రాస్ అధికారులకు అప్పగించారు. ఇజ్రాయెల్ బందీ తాల్ షోహమ్‌ను విడుదల సమయంలో వేదికపైన హమాస్ నడిపించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. హమాస్‌కు ఇచ్చిన గడువు మరికొన్ని గంటల్లో ముగియనుంది. శనివారం మధ్యాహ్నం 12 గంటలలోపు ఇజ్రాయెల్ బందీలందరినీ ఒకేసారి విడుదల చేయాలని హమాస్‌కు ట్రంప్ అల్టిమేటం విధించారు.
Israel : గాజా-ఇజ్రాయెల్ కాల్పుల విరమణ సమయంలో గాజా స్ట్రిప్‌లో జరిగిన రహస్య ఆపరేషన్‌లో సైనికుడు స్టాఫ్ సార్జెంట్ ఒరాన్ షాల్ మృతదేహాం అవశేషాలను స్వాధీనం చేసుకున్నట్లు ఐడీఎఫ్ (ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్) పేర్కొంది.
Israel Attack On Gaza : కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటించిన తర్వాత మరోసారి యుద్ధం మొదలైంది. గాజాలో ఇజ్రాయెల్ మళ్ళీ వైమానిక దాడులు ప్రారంభించింది. ఈ దాడిలో ఇప్పటివరకు మృతుల సంఖ్య 100కు చేరుకుంది.
హమాస్ అంతమే లక్ష్యంగా నూతన సంవత్సరం వేళ కూడా ఇజ్రాయెల్ వేట సాగిస్తోంది. న్యూఇయర్ వేళ జరిపిన దాడుల్లో పదుల కొద్దీ చనిపోగా.. ఇక తాజాగా జరిగిన దాడుల్లో హమాస్ అగ్ర అధికారులతో సహా 10 మంది చనిపోయారు.
సిరియాపై ఇజ్రాయెల్ డజన్ల కొద్దీ వైమానిక దాడులు నిర్వహించింది. సిరియా అంతటా క్షిపణులు ప్రయోగించింది. దీంతో బాంబు దాడులతో సిరియా దద్దరిల్లింది. తాజాగా సిరియా తిరుగుబాటుదారుల చేతుల్లోకి వెళ్లిపోయింది.
ఇరాన్ అణు స్థావరాలపై దాడి చేసినట్లుగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అంగీకరించారు. అక్టోబర్ చివరిలో అకస్మా్త్తుగా ఇరాన్ అణు స్థావరాలపై ఐడీఎఫ్ దళాలు దాడి చేశాయి. దీంతో ఒక్కసారిగా ఇరాన్ ఉలిక్కిపడింది.