Nicholas Pooran Fine: పూరన్‌కు భారీ షాక్ ఇచ్చిన ఐసీసీ.. కారణం ఏంటంటే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nicholas Pooran Fined 15 Percent Match Fee for Criticising Umpires: వెస్టిండీస్ వికెట్ కీపర్, బ్యాటర్ నికోలస్ పూరన్‌కు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) భారీ షాక్ ఇచ్చింది. ఐసీసీ లెవెల్-1 ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఫైన్ విధించింది. ఆదివారం గయానా వేదికగా భారత్‌తో జరిగిన రెండో టీ20లో అంపైరింగ్ నిర్ణయాలను వ్యతిరేకించినందుకు పూరన్ మ్యాచ్ ఫీజులో 15 శాతం ఐసీసీ కోత విధించింది. ఒక డీమెరిట్ పాయింట్ కూడా అతని ఖాతాలో చేరింది.
వెస్టిండీస్ ఇన్నింగ్స్ సందర్భంగా అర్ష్‌దీప్ సింగ్ 4 ఓవర్ వేశాడు. ఆ ఓవర్‌లోని నాలుగో బంతిని కైల్ మేయర్స్ లెగ్ సైడ్ షాట్ ఆడాడు. అయితే బంతి అతడి ప్యాడ్‌కు తాకింది. వెంటనే భారత ఫీల్డర్లు ఎల్బీకి అప్పీల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇచ్చేశాడు. కైల్ మేయర్స్ నాన్‌స్ట్రైక్‌లో ఉన్న నికోలస్ పూరన్‌తో చర్చించి.. రివ్యూ కోరాడు. రిప్లై పరిశీలించిన థర్డ్ అంపైర్.. అంపైర్ కాల్ ఇచ్చాడు. దీంతో మేయర్స్ పెవిలియన్ చేరాడు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
Also Read: Tesla Vaibhav Taneja: టెస్లా కొత్త సీఎఫ్‌వోగా భారత సంతతి వ్యక్తి వైభవ్ తనేజా.. షేర్లు పతనం!
ఫీల్డ్ అంపైర్ నిర్ణయంపై నికోలస్ పూరన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘నువ్ ఔట్ ఇవ్వకపోయి ఉంటే.. కైల్ మేయర్స్ కచ్చితంగా నాటౌటే’ అంటూ బహిరంగంగా అన్నాడు. ఈనేపథ్యంలోనే ఫీల్డ్ అంపైర్‌లు లెస్లీ రీఫర్ మరియు నిగెల్ డుగైడ్.. మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్‌సన్‌కు ఫిర్యాదు చేశారు. దాంతో రిఫరీ పూరన్‌పై చర్యలు తీసుకున్నాడు. పూరన్ తన తప్పును అంగీకరించడంతో అధికారిక విచారణ అవసరం లేకుండా పోయింది. రెండేళ్ల వ్యవధిలో పూరన్‌కు ఇదే మొదటి జరిమానా. లెవెల్ 1 కిందకు వచ్చే నేరాలకు గరిష్టంగా 50 శాతం ఆటగాడి మ్యాచ్ ఫీజులో కోత మరియు ఒకటి లేదా రెండు డీమెరిట్ పాయింట్లు ఇస్తారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..